అగ్గిపెట్టె సైజులో ‘ఈసీజీ’ పరికరం
దిశ, వెబ్‌డెస్క్ : కొందరు ఉన్నట్టుండి గుండె మీద చేయి వేసుకుని, భరించలేని నొప్పితో కిందపడిపోతారు. కొన్నిసార్లు వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోగా చనిపోతారు. డెహ్రాడూన్‌కు చెందిన 25 ఏళ్ల రజత్ జైన్‌కు కూడా ఓ స్నేహితుడి విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన స్నేహితుడు హృద్రోగ సమస్య కారణంగా తన కళ్ల ముందే చనిపోవడాన్ని చూసి రజత్ తట్టుకోలేకపోయాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి ఇలా 17.9 మిలియన్ల మంది చనిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే […]
దిశ, వెబ్‌డెస్క్ : కొందరు ఉన్నట్టుండి గుండె మీద చేయి వేసుకుని, భరించలేని నొప్పితో కిందపడిపోతారు. కొన్నిసార్లు వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోగా చనిపోతారు. డెహ్రాడూన్‌కు చెందిన 25 ఏళ్ల రజత్ జైన్‌కు కూడా ఓ స్నేహితుడి విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన స్నేహితుడు హృద్రోగ సమస్య కారణంగా తన కళ్ల ముందే చనిపోవడాన్ని చూసి రజత్ తట్టుకోలేకపోయాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి ఇలా 17.9 మిలియన్ల మంది చనిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా జరగడానికి కారణం ఏంటి? పరిస్థితి చేయి దాటే వరకు హృద్రోగ సమస్యలను గుర్తించకపోవడమే కారణమని రజత్ తెలుసుకున్నాడు. ముఖ్యంగా ఈసీజీ సదుపాయం అందుబాటులో ఉండి ఉంటే హృద్రోగాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉందని గ్రహించి, తన స్నేహితులు సౌరభ్ బడోలా, సాబిత్ రావత్, నితిన్ చందోలాలతో కలిసి ‘సన్‌ఫాక్స్ టెక్నాలజీస్’ పేరుతో ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు.
ఈ స్టార్టప్ ద్వారా జ్వరం చూడటానికి థర్మామీటర్ ఉపయోగించినట్లే, హృదయం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రాథమిక స్థాయి ఈసీజీ పరికరాన్ని తయారుచేశారు. దీనికి ‘స్పందన్’ అని పేరుపెట్టారు. చిన్న అగ్గిపెట్టె సైజులో ఉన్న ఈ పరికరాన్ని ఒక కేబుల్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పందన్ ఈసీజీ యాప్ ద్వారా ఈ పరికరం నమోదు చేసిన రీడింగులను బట్టి గుండె పరిస్థితిని తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈసీజీ అనేది డాక్టర్లకు మాత్రమే అర్థమవుతుంది. కానీ ఈ పరికరం సాయంతో సాధారణ వ్యక్తులు కూడా హృదయ పరిస్థితిని సాధారణ భాషలో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పరికరాన్ని నమ్మవచ్చా?
మూడు రకాల రంగుల్లో స్పందన్ పరికరం గుండె కండిషన్‌ను తెలియజేస్తుంది. ఎరుపు రంగులో ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని, పసుపు రంగులో ఉంటే ఏదో సమస్య ఉందని, ఆకుపచ్చ రంగులో ఉంటే అన్నీ బాగున్నాయని అర్థం. అయితే రీడింగులు 99.7 శాతం కచ్చితమైనవి. ఈ పరికరాన్ని రూపొందించేటపుడు 10 మంది కార్డియాక్ నిపుణులతో కలిసి అన్ని రకాల హృద్రోగాల లక్షణాల డేటాబేస్‌ను సన్‌ఫాక్స్ టెక్నాలజీస్ తయారు చేసింది. అంతేకాకుండా ఇంత చిన్న పరికరం ఒక్క ఐదు నిమిషాల్లో హృదయ స్పందన రీడింగులను గుర్తించి, 21 రకాల హృద్రోగాలను గుర్తించగలదని రజత్ తెలిపారు.