కోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తే అది బౌలర్లకు ప్రమాదకరం

దిశ, స్పోర్ట్స్ : బాక్సింగ్‌డే టెస్టులో అజింక్య రహానే కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మాన్‌గా కూడా రాణించడంతో సర్వత్రా అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒత్తిడిలో కూడా అతను జట్టును పై చేయిగా నిలపడంలో విజయం సాధించాడని కొనియాడుతున్నారు. గతంలో పుజార పోషించిన పాత్రను రెండో టెస్టులో రహానే పోషించాడని అంటున్నారు. కెప్టెన్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని రహానే చక్కగా వినియోగించుకుంటున్నాడని పలువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత రికీ పాంటింగ్ మరింత లోతైన వ్యాఖ్యలు […]

Update: 2020-12-27 10:53 GMT

దిశ, స్పోర్ట్స్ : బాక్సింగ్‌డే టెస్టులో అజింక్య రహానే కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మాన్‌గా కూడా రాణించడంతో సర్వత్రా అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒత్తిడిలో కూడా అతను జట్టును పై చేయిగా నిలపడంలో విజయం సాధించాడని కొనియాడుతున్నారు. గతంలో పుజార పోషించిన పాత్రను రెండో టెస్టులో రహానే పోషించాడని అంటున్నారు. కెప్టెన్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని రహానే చక్కగా వినియోగించుకుంటున్నాడని పలువురు మాజీ క్రికెటర్లు అంటున్నారు.

ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత రికీ పాంటింగ్ మరింత లోతైన వ్యాఖ్యలు చేశారు. టీమ్ ఇండియాకు విరాట్ కోహ్లీ కోరుకున్నంత కాలం కెప్టెన్‌గా కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే భారత్‌కు లాభమే. అతడు కనుక బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కెప్టెన్సీ వదిలేసుకుంటే అది ప్రపంచంలోని ప్రతీ బౌలర్‌కు ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతానికి అతడి కెప్టెన్సీ లక్షణాలపై సందేహాలు లేవు. కానీ కోహ్లీ ఎక్కడైతే విఫలమయ్యాడో అక్కడ రహానే ముందుకు వెళ్లాడు’ అని పాంటింగ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

Tags:    

Similar News