నెల్లూరు జిల్లాలో ఆగిపోయిన పోలింగ్

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలోని ఓ కేంద్రంలో పోలింగ్ ఆగిపోయింది. పోలింగ్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వెంటనే ఓటర్లను నిలిపివేశారు. ఆ అధికారిని ఓ ప్రత్యేక గదిలో ఉంచారు. కలువాయి మండలం పేరంకొండ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ అధికారికి కరోనా రావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది వెంటనే పోలింగ్ కేంద్రాన్ని శానిటైజేషన్ చేశారు. అయితే పోలింగ్ అధికారికి కరోనా అని తెలియడంతో ఓటర్లు లోపలికి వెళ్లడానికి భయపడుతున్నారు. […]

Update: 2021-04-17 04:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలోని ఓ కేంద్రంలో పోలింగ్ ఆగిపోయింది. పోలింగ్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వెంటనే ఓటర్లను నిలిపివేశారు. ఆ అధికారిని ఓ ప్రత్యేక గదిలో ఉంచారు. కలువాయి మండలం పేరంకొండ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ అధికారికి కరోనా రావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది వెంటనే పోలింగ్ కేంద్రాన్ని శానిటైజేషన్ చేశారు. అయితే పోలింగ్ అధికారికి కరోనా అని తెలియడంతో ఓటర్లు లోపలికి వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం పోలింగ్ ను ఆపేసిన అధికారులు.. తిరిగి ప్రారంభిస్తారా..? లేక వాయిదా వేస్తారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.

Tags:    

Similar News