అవును.. మీకు గోరి కట్టే గుంపు మేస్త్రిని:రేవంత్ రెడ్డి

తనను గుంపు మేస్త్రి అంటూ బీఆర్ఆర్ఎస్ చేస్తున్న ట్రోల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి రియాక్ట్ అయ్యారు. తాను మేస్త్రీ నేనని.. విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించడంతో పాటు మీకు (బీఆర్ఎస్) గోరీ కట్టే మేస్త్రిని నేనే అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Update: 2024-01-25 13:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తనను గుంపు మేస్త్రి అంటూ బీఆర్ఆర్ఎస్ చేస్తున్న ట్రోల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి రియాక్ట్ అయ్యారు. తాను మేస్త్రీ నేనని.. విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించడంతో పాటు మీకు (బీఆర్ఎస్) గోరీ కట్టే మేస్త్రిని నేనే అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవల్ లీడర్స్ మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు అప్పుడే హామీల అమలు ఎక్కడా అని బిల్ల,రంగాలు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్, హరీశ్ రావులను ఉద్దేశించి మండిపడ్డారు. బీఆర్ఎస్ పులి బయటకు వస్తే బోనులో వేసి బొందపెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ ఏదో పొడుస్తా అన్నాడు.. కానీ చెప్పినట్లుగా ఓడించామా లేదా అన్నారు.

బిడ్డా.. వస్తున్నా కాస్కోండి:

సీఎంగా ఉన్నాను కాబట్టి ఇన్నాళ్లు పరిపాలనపై దృష్టి పెట్టి రాజకీయంగా మాట్లాడటం లేదన్నారు. కానీ మాట్లాడకపోతే పని జరిగేలా లేదని, బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. జిల్లాల పర్యటనలకు వస్తున్నానని బిడ్డా కాస్కోవాలంటూ నిప్పులు చెరిగారు. వారంలో 3 రోజులు రేవంతన్నగా ప్రజల మధ్యకు రాబోతున్నట్లు చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ, కేటీ వేరు వేరు కాదని ఈ ఇద్దరి రూపాలు మాత్రమే వేరన్నారు. కేసీఆర్, మోడీ నాణేనికి బొమ్మా బొరుసులాంటివారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి, రెండు ఎంపీలు గెలిచినా ఢిల్లీకి వెళ్లి అవి మళ్లీ మోడికే ఇస్తారని ఆరోపించారు. కేసీఆర్ కు పడే ప్రతి ఓటు పరోక్షంగా బీజేపీకే పడుతుందన్నారు. బీఆర్ఎస్ ను మొన్నటి ఎన్నికల్లో ఓడించామని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తరిమికొడదామని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామన్నారు.

ఫిబ్రవరి ఆఖరు వరకు మరో రెండు పథకాలు:

ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 హామీలు అమలు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేశారా అని నిలదీశారు. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతుభరోస ద్వారా నగదు అందిస్తామన్నారు.

Tags:    

Similar News