YSRCP: టీడీపీకి ఓటేసిన వైసీపీ ఎమ్యెల్యే.. అసలేం జరిగిందంటే..?
సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీ నేతలు తమకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతారు.
దిశ వెబ్ డెస్క్: సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీ నేతలు తమకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతారు. పోలింగ్ సమయంలో తమ ఓటును తమ పార్టీకే వేసుకుంటారు. ఎవరు కూడా ప్రత్యర్థికి ఓటు వేయాలి అని కలలో కూడా అనుకోరు. కాని ఓ వైసీపీ ఎమ్యెల్యే మాత్రం టీడీపీకి ఓటేశారు. ఈ ఘటన కావలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పోలింగ్ వేళ కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముసునూరు ZPHSలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటేశారని సమాచారం.
ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పోలింగ్ బూత్‌లో వేసిన ఓటు విషయం బయటకి ఎలా తెలిసింది..?
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. దీనితో పోలింగ్‌సిబ్భంది ఆయన వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటారు. ఓటు వేసే సమయంలోనూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంట సిబ్భంది ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సైకిల్‌కి ఓటు వేయడం వాళ్లు చూశారని సమాచారం. అలానే ఈ విషయం బయట చెప్పొద్దు అని పోలింగ్‌సిబ్భందిని బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ ఆయనే పోలింగ్ ముగిసిన తరువాత, తాను పొరపాటున టీడీపీకి ఓటు వేసినట్టు తెలిపారు.
పొరపాటున జరిగిన తప్పిదమా..? తప్పించుకునే యత్నమా..?
స్థానికంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ 4వేల కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోతుందని, అదే జరిగితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కచ్చితంగా జైలుకు వెళ్తారనే చర్చ స్థానికంగా జరుగుతోందని.. ఈ నేపథ్యంలో తాను కూడా టీడీపీకి ఓటు వేశానని టీడీపీ నేతలను భ్రమింపచేసి తాను బయట పడేందుకు ప్రీప్లాన్‌గా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.