ఇంకా బ్రిటిష్ భవనాలనే వాడుదామా?.. విపక్షాలపై కేంద్రమంత్రి పీయూష్ ఫైర్
కొత్త పార్లమెంట్ ప్రారంభం వివాదంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్: కొత్త పార్లమెంట్ ప్రారంభం వివాదంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. నూతన పార్లమెంట్ భవనం విషయంలో విపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఇంకా బ్రిటిష్ వాళ్లు నిర్మించిన పార్లమెంట్ భవనాన్నే వాడుదామా అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తోందని అన్నారు. కాగా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవకపోవడాన్ని ప్రధాన విపక్షాలు వ్యతిరేకించాయి. దేశ ప్రథమ పౌరురాలిని పిలవకుడా అవమానించారని ఆరోపిస్తున్నారు.