త్రిపుర సీఎంగా మళ్లీ మానిక్ సాహానే

త్రిపుర సీఎంగా మానిక్ సాహాను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Update: 2023-03-06 13:50 GMT

దిశ, వెబ్ డెస్క్: 60 స్థానాలు గల త్రిపుర అసెంబ్లీకి ఇటేవలే ఎన్నికలు పూర్తయ్యాయి. 33 స్థానాలు గెల్చుకున్న అధికార బీజేపీ మళ్లీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాగా ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతోన్న మానిక్ సాహానే మళ్లీ సీఎంగా కొనసాగించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశంలో ప్రస్తుత సీఎం మానిక్ సాహానే మళ్లీ సీఎంగా ఎన్నుకుంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 8న జరగనుంది.

పీఎం మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది మే నెలలో మానిక్ సాహా త్రిపుర సీఎంగా మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ పెద్దల ఆశీస్సులతో త్రిపుర ఎన్నికల్లో మానిక్ సాహా అన్ని తానై వ్యవహరించారు. ఈ కారణంగానే ఆయనకు మరోసారి సీఎం పదవిని కట్టబెడుతూ అధిష్టానం నిర్ణయం తీసుకుందని పార్టీలో చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News