డిగ్రీ తప్పిన స్పీకర్ ఎల్ఎల్బీ ఎలా చదివారు?: టీడీపీ నేత ధూళిపాళ్ల
స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో : స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిగ్రీ తప్పిన స్పీకర్ ఎల్ఎల్బీ ఎలా చదివారు? అని నిలదీశారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తే వైసీపీలో అలజడి మొదలైందని విమర్శలు గుప్పించారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీ.. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీని చూసి ఎందుకు వణుకుతోందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక్క రోజు స్పీకర్ సెక్యూరిటీ లేకుండా తిరగ్గలరా ? అని ప్రశ్నించారు. మొన్నటి టీడీపీ మేనిఫెస్టో చిన్న టీజర్ మాత్రమేనని.. అసలు సినిమా దసరాకు ఉందన్నారు.
టీడీపీ మేనిఫెస్టోకి పిచ్చెక్కి 15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారని ధుళిపాళ్ల అన్నారు. మరోవైపు అంబటి రాంబాబు అసమర్థ ఇరిగేషన్ మంత్రి అని విమర్శించారు. కొడాలి నాని అసమర్థుడు కాబట్టి.. జగన్ మంత్రి పదవి ఊడగొట్టారని అన్నారు. కేబినెట్ నుంచి తరిమికొడితే నాని బయటకి వచ్చి పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడన్నారు. దసరాకు అసలు సినిమా చూపిస్తామని ధుళిపాళ్ల అన్నారు.
Also Read..
చంద్రబాబు మేనిపెస్టోతో వైకాపాలో వణుకు.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు