టీఆర్ఎస్, బీజేపీపై RS Praveen Kumar సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది. ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై దుమారం చెలరేగుతోంది. ఇందులో తన పాత్ర లేదని కవిత క్లారిటీ ఇచ్చినా బీజేపీ మాత్రం ఆరోపణల తీవ్రత తగ్గించడం లేదు. కవిత విషయంలో సీబీఐ ఎంక్వయిరీ జరుగుతోందని దర్యాప్తు అనంతరం నిజమేంటో నిగ్గుతేలుతుందని బీజేపీ ఎటాక్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ కుంభకోణంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూజెర్సీ రాష్ట్రంలో బహుజన బిడ్డలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ అమెరికాలో తమ నైపుణ్యాలకు సానబెడుతూ ఎంతో శ్రమిస్తున్న మన బిడ్డలను కలుసుకున్నానని చెప్పారు.
ఇలాంటి లక్షలాది బిడ్డలను ప్రయోజకులుగా చేసేందుకే బీఎస్పీ శ్రమిస్తోందని వారి ప్రతిభను ప్రశంసించారు. అయితే దోపిడీ దొంగలు మాత్రం తమ పిల్లలను లిక్కర్ స్కాం నిందితులుగానో లేదా దొడ్డి దారిన బీసీసీఐ కార్యదర్శులగానో చేస్తారు అంటూ టీఆర్ఎస్, బీజేపీపై సైటైర్లు వేశారు. లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె తన అనుచరుల ద్వారా లబ్దిపొందారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే, టీఆర్ఎస్ సైతం బీజేపీపై రివర్స్ ఎటాక్ చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల అమిత్ షా విషయంలో టీఆర్ఎస్ ఓ విషయంలో విమర్శల తీవ్రత పెంచింది. ప్రధాని తర్వాతి స్థానంలో ఉన్న హోం మంత్రి అమిత్ షా కొడుకు అత్యంత శక్తివంతమైన బీసీసీఐ గౌరవ కార్యదర్శి ఎలా అయ్యారు? అంటూ ఎటాక్ చేస్తోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన బిడ్డలతో భేటీ అనంతరం చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.