బీజేపీ శ్రేణులకు మోడీ క్షమాపణలు.. మాటలు రావట్లేదంటూ తెలంగాణ ఎంపీ ఎమోషనల్ (వీడియో)

ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలకు, తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. నిబంధనలు అతిక్రమించేందుకు తనకు మనసు ఒప్పుకోవడం లేదని అందువల్ల మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నాన్నారు.

Update: 2022-10-01 06:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలకు, తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. నిబంధనలు అతిక్రమించేందుకు తనకు మనసు ఒప్పుకోవడం లేదని అందువల్ల మీ అందరికీ క్షమాపణలు కోరుతున్నాన్నారు. శుక్రవారం రాజస్థాన్ సిరోహిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో ఆసక్తిగా మారింది. శుక్రవారం సిరోహి పర్యటనకు మోడీ వెళ్లారు. అంతకు ముందు వివిధ కార్యక్రమాల వల్ల అబు రోడ్ లో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి ఆలస్యం జరిగింది. అప్పటికే పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోడీ అభిమానులు అక్కడ హాజరయ్యారు. అయితే మోడీ చేరుకునేటప్పటికీ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది.

రాజస్థాన్ లో 10 దాటిన తర్వాత మైక్ లు, లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం అమలులో ఉంది. దీంతో నిబంధనలకు లోబడి ప్రధాని మోడీ మైక్ లేకుండానే మాట్లాడారు. దయచేసి తనను అందరూ క్షమించాలని నిబంధనలు అతిక్రమించి మైక్ లో మాట్లాడేందుకు తన మనసాక్షి అంగీకరించడం లేదన్నారు. మోకాళ్లపై కూర్చుని మీ ప్రేమ, ఆదరాభిమానాలకు ధన్యవాదాలు అని అన్నారు. మీ అదరి కోసం ఇక్కడి మరోసారి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగం ముగించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బీజేపీ నేతలు ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో మోడీ సింపుల్ సిటీ అంటూ నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు.

Also Read:  భారత్‌లో మరో అద్భుత ఘట్టం: 5G సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

Tags:    

Similar News