మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం: Teenmar Mallanna

మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు.

Update: 2023-07-15 12:33 GMT
మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం: Teenmar Mallanna
  • whatsapp icon

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తి తానేనని అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద పెట్టని కేసులు తనపై పెట్టారని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంతకన్నా అర్హత ఏముంటదని మల్లన్న ప్రశ్నించారు.

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిపాజిట్లు కూడా రావని చేసిన వ్యాఖ్యలకు తీన్మార్ మల్లన్న స్పందిస్తూ డిపాజిట్ల స్పెల్లింగ్ చెప్పిన తర్వాత మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యల పై స్పందిస్తానన్నారు. శనివారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు తీన్మార్ మల్లన్న నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్న టీం సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News