Politics: అంతలేదమ్మా.. ప్రధాని మోడీకి అదే తెలిస్తే.. ముందు ఇదే చేసేవారు..!

ఇతరులపై బురద జల్లాలని చూస్తే ఆ బురద మొదట మన చేతికే అంటుకుంటుంది

Update: 2024-06-10 07:50 GMT

దిశ వెబ్ డెస్క్: ఇతరులపై బురద జల్లాలని చూస్తే ఆ బురద మొదట మన చేతికే అంటుకుంటుంది, అనే విషయాన్ని వైసీపీ విస్మరించిందని అటు ప్రజలు, ఇటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమిపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఇటీవల దేశ వ్యాప్తంగా 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం అందరికీ తెలిసిందే.

అలానే ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజారిటీతో కూటమి విజయం సాధించింది. అయితే ఇప్పటికి కనీసం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ.. వైసీపీ మాత్రం కూటమి పార్టీ నేతలపై బురద జల్లేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తూనే ఉంది.

ఫలితాల రోజే మనసులో మాట బయట పెట్టిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..

జూన్ 4న 2024 ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ పూర్తికాకముందే జగన్ ప్రస్‌మీట్ పెట్టారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను రాష్ట్రంలోని కోట్లమంది ప్రజలకు మేలు చేసినట్టు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులు తాను చేసినప్పటికీ, తాను ఊహించని విధంగా పలితాలు వచ్చాయని, కనుక ఎవరో మోసం చేశారని, అన్యాయం చేశారని అనవచ్చు కానీ.. ఆధారాలు లేవని, నిజానిజాలు దేవుడికే తెలుసని మనసులో మాట బయట పెట్టారు.

టీడీపీపై విమర్శలు చేసేందుకే ట్విట్టర్ అకౌంట్..

ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుండి అటు మాజీ సీఎం జగన్, ఇటు వైసీపీ నేతలు, వైసీపీ మీడియా, సోషల్ మీడియా, కూటమి పార్టీలే లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని.. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ నేతలు స్వైరవిహారం చేస్తున్నాయని.. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని.. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని.. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పాటడిదే పాటరా పాసిపళ్ల దాసరా అన్నట్టు వైసీపీ చేప్పిందే చెబుతోంది.

ముఖ్యంగా టీడీపీ అక్కడ వైసీపీ కార్యకర్తలపై దాడి చేసింది ఇక్కడ వైసీపీ కార్యకర్తలపై దాడి చేసింది అంటూ వైసీపీ చేస్తున్న పోస్టులు చూస్తే టీడీపీపై విమర్శలు చేసేందుకే ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా అని అనిపిస్తోందని నెటిజన్స్ అంటున్నారు.

ఈవీఎంలు ట్యాంపరింగ్.. అందుకే అన్ని సీట్లు..

2024 ఎన్నికల్లో కూటమి 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈవిఎంలు ట్యాంపరింగ్ చేశారని, మోడీ సహకారంతోనే, సిగపూర్‌లోనే ఈవిఎంలను హ్యాక్ చేశారని వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపణల జల్లు కురిపిస్తోంది.

ప్రధాని మోడీకి అదే తెలిస్తే.. ముందు ఇదే చేసేవారు..!

మోడీ సహకారంతో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని అందుకే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ సోషల్ మీడియా చెప్పిందే చెబుతోంది. అయితే వైసీపీ చేస్తున్న పోస్టులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీకి ఈవిఎంలు ట్యాంపరింగ్ చేయడం తెలియదని, అదే తెలిసుంటే బీజేపీ 294 సీట్లకే ఎందుకు పరిమితం అవుతుంది, బీజేపీకి 300 సీట్లను వచ్చేవి కదా.. ఒక దొంగకి అందరూ దొంగల్లానే కనిపిస్తారన్నట్టు జగన్‌కి అందరూ తనలానే అవినీతికి పాల్పడతారని అనుకోవడం సరికాదని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి, అంటే అప్పుడు వైసీపీ ఈవిఎంలు ట్యాంపరింగ్ చేసిందా..? అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదు, టెక్నికల్‌గా అది సాధ్యంకాదు, ఇది మీకు తెలియకపోయినా చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు అని, వైసీపీ నేతలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే గెలిచిన పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  


Similar News