Memes on CM Jagan: అంతా ఐ ప్యాక్ మయం.. ముఖ్యమంత్రి జగన్‌పై మీమ్స్

అధికారంలోకి వస్తున్నాం అని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐప్యాక్ టీంకి చెప్పడం విపక్షాలతో పాటు సొంత పార్టీ వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Update: 2024-05-17 05:02 GMT

దిశ ప్రతినిధి, అమరావతి: అధికారంలోకి వస్తున్నాం అని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐప్యాక్ టీంకి చెప్పడం విపక్షాలతో పాటు సొంత పార్టీ వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోలింగ్ ముగియగానే పార్టీ నేతలతో సమీక్ష జరిపో, ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసో అధికారంలోకి రాబోతున్నాం అని చెబితే బాగుంటుంది కానీ ఇలా ఐ ప్యాక్ టీం దగ్గర చెప్పడమేమిటో అని ఆశ్చర్యపోతున్నారు.

క్యాడర్‌కు చెప్పరా?

తాము అధికారంలోకి రాబోతున్నమనే విషయం ముందుగా క్యాడర్‌కి చెప్పాలి, తరువాత ప్రజలకు చెప్పాలి కానీ అధికారంలోకి తీసుకువచ్చేందుకే కోట్ల రూపాయలు పుచ్చుకొని పనిచేసిన ఐప్యాక్‌కు చెప్పడమేమిటో అర్ధం కావడం లేదని పార్టీనేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి రావడానికి.. స్ట్రాటజీలు ఇచ్చింది ఐప్యాక్ వాళ్ళే కదా!? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అంతా ఐప్యాక్ మయమేగా!?

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ నేతల కంటే, పార్టీ సీనియర్ల కంటే ఐ ప్యాక్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినందున ఇదేమీ కొత్త విషయం కాదని వారిలో వారే సర్ది చెప్పుకొంటున్నారు. ఎవరెవరు ఏం మాట్లాడాలనే స్క్రిప్టు ఇచ్చింది కూడా ఐప్యాక్ వాళ్ళే కదా!? అని గుర్తు చేసుకొంటున్నారు. చివరకు పార్టనర్ సమ్మిట్‌లో పెట్టుబడిదారులుగా వచ్చింది కూడా ఐప్యాక్ వాళ్ళే కదా!? అని సోషల్ మీడియాలో అప్పుడే మీమ్స్ మొదలయ్యాయి. పార్టీ కంటే కూడా జగన్‌కు శ్వాస, ధ్యాస ఐ ప్యాకే అంటూ ఎద్దేవ చేస్తున్నారు.

గతంలో అభివృద్ధి పనుల్లోనూ వారే..

రాష్ట్రంలో ఎక్కడెక్కడ రోడ్లు వెయ్యాలి, ఏఏ పథకాలకు నిధులు విడుదల చెయ్యాలి అనే నిర్ణయాలు తీసుకుని ముఖ్యమంత్రిని ఆదేశించింది కూడా ఐప్యాక్ వాళ్ళే అంటూ పార్టీకి చెందిన శాసనససభ్యులే గుర్తు చేస్తున్నారు. కార్యకర్తల ద్వారా తమకు వచ్చిన పనులకు సంబంధించిన డిమాండ్‌లను అమలు పర్చడానికి ఐ ప్యాక్‌నే ఆశ్రయిచాంల్సి వచ్చేదని గుర్తు చేస్తున్నారు. మునిసిపాలిటీ మీటింగులు మొదలుకుని అపోజిషన్ పార్టీల మీటింగుల వరకూ పార్టీ తరపున పాల్గొంది ఐప్యాక్ వాళ్ళే కదా !?

వారికి ఇప్పుడు జగన్ అంత ప్రాధాన్యత ఇవ్వడం, కౌగిలించుకొని, సెల్పీలు దిగడంలో తప్పేమీ లేదన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం గెలుస్తున్నాం అని చెప్పాల్సింది కూడా ఐప్యాక్ వాళ్ళే అని, పార్టీ ముఖ్యలు కాదని సొంత పార్టీ వారే సెటైర్లు వేస్తున్నారు. ఐ ప్యాక్‌కు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీకి, క్యాడర్‌కు ఇచ్చి వుంటే ఇప్పుడీ దుస్థితి వచ్చి వుండేది కాదని గొణుక్కొంటున్నారు.


Similar News