AP Politics: మే 1 న ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వండి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా వృద్ధులకి ఇచ్చే పింఛన్లు మే 1 న ఇంటింటికీ పంపిణీ చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చెయ్యాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాని కోరారు.

Update: 2024-04-25 09:07 GMT

దిశ ప్రతినిధి,అనకాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా వృద్ధులకి ఇచ్చే పింఛన్లు మే 1 న ఇంటింటికీ పంపిణీ చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చెయ్యాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాని కోరారు.  గురువారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారని, 15 వేల సచివాలయాలు,1,35 వేల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారని తెలిపారు.

నిజంగా వైసీపీ పెన్షన్‌ను ఇంటింటికీ పంపిణీ చేయాలనుకుంటే సగటున 440 మంది పింఛను దారులు ఉంటారని, వీరికి అదే గ్రామంలో రెండు మూడు రోజుల్లో సచివాలయం సిబ్బందితో పింఛను ఇప్పించ వచ్చని, ప్రభుత్వం గత నెలలో సక్రమమైన ఏర్పాట్లు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది వృద్ధులు మృతి చెందారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఊహించని స్థాయిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పింఛను దారులను సచివాలయం చుట్టూ తిప్పడం మంచిది కాదన్నారు. పింఛను పంపకాల చుట్టూ రాజకీయాలు చేరకుండా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ కి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాలని భీశెట్టి కోరారు.

మద్యం అమ్మకాలపై దృష్టి సారించండి!!

రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో చాలా మతలబులు జరుగుతున్నాయని, కొన్నిచోట్ల మద్యం కొనుగోలు దారుడి నుండి డబ్బులు వసూలు చేస్తూ, మరికొన్ని చోట్ల కార్డుపై అమ్మకాలు చేస్తున్నారని, బార్లు బార్ల తెరిచిపెట్టి మద్యం దుకాణాలు మూసివేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నట్టు తెలిపారు. నగదు రూపంలో జరుగుతున్న అమ్మకాల వెనుక జరిగే మతలబులుపై రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు దర్యపు చేసేలా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీ, సీఎస్‌లకు రాసిన లేఖను విడుదల చేసారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం నేత బొలిశెట్టి శ్రీనివాసరావు , పౌరవేధిక ప్రతినిధి కొలసాని రమణ, గిరిజన సంఘం నేత లెంకల విశ్వేశ్వర్రావు,పెంటకోట గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News