Ex-minister Roja has lost her mind: ‘మాజీ మంత్రి రోజాకు మతిభ్రమించింది’
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలల సౌధం. రూ. 500 కోట్లు వ్యచించి కట్టుకున్న రాజభవనం రుషికొండ ప్యాలెస్ గురించి అందరికీ తెలిసిందే.
దిశ వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలల సౌధం. రూ. 500 కోట్లు వ్యచించి కట్టుకున్న రాజభవనం రుషికొండ ప్యాలెస్ గురించి అందరికీ తెలిసిందే. మానవమాతృడు ఎవరూ ఆ ప్యాలెస్‌లోకి అడుగు పెట్టలేరూ అనే రీతీలో వైసీపీ కలరింగ్ ఇచ్చింది. అయితే ఆ రుషికొండ ప్యాలెస్‌పై పలు కేసులు నమోదు కావడంతో ప్యాలెస్ నిర్మాణం పూర్తైనా అప్పటి సీఎం జగన్ ప్యాలెస్‌లో అడుగు పెట్టలేకపోయారు.
ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీనితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కలల సౌధంలోకి కాలు పెట్టకుండానే అధికారంలో నుండి దిగిపోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మీడియాతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో రుషికొండ ప్యాలెస్ లోపల ఏముందో బాహ్యప్రపంచానికి చూపించారు.
పైన పటారం లోన లోటారం
నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత రహస్యంగా రూ.500 కోట్లు వెచ్చించి రాజమహల్ తలపించేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుషికొండపై భవనాన్ని నిర్మించారు. సైటు మొత్తం విస్థీర్ణం 61 ఎకరాలు కాగా అందులో 9.8 ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు. కాగా ఈ భవనంలో మొత్తం ఏడు బ్లాకులు ఉంటాయి, ఒక్కో బ్లాకుకి ఒక్కో పేరె పెట్టారు. పూర్వీకుల కాలంలో, సద్దాం హుస్సేన్ వంటి వాళ్లు నిర్మించుకున్న భవనాల తరహాలో మాజీ మంత్రి జగన్ ఈ భవనాన్ని నిర్మించారు.
రివ్యూలు, సమీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం ఉంది. ఒక్కో హాల్‌ను అత్యంత విశాలంగా నిర్మించారు, దీనితో ఈ భవనాన్ని హోటల్‌గా మార్చే అవకాశం సైతం లేకుండాపోయింది.
టూరిజం రిసార్ట్స్‌ను నాశనం చేసి నూతన భవన నిర్మాణం..
గతంలో రుషి కొండపై హరిత రిసార్ట్స్ ఉండేవి. కాగా రిసార్ట్స్ ద్వారా దాదాపు ఏడాదికి ఎనిమిది కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని సమాచారం. అయితే గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుషికొండపై ఉన్న హరిత రిసార్ట్స్‌ను కూలదోసి, కొండపై ఉన్న పచ్చదనాన్ని నాశనం చేసి, అసత్యాలతో నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాన్ని నిర్మించారనే ఆరోపనలు వినిపిస్తున్నాయి.
మొదటగా స్టార్ హోటల్ అని చెప్పిన జగన్ ఆ తరువాత ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అని, ఆపై టూరిజం ప్రాజెక్టు అని చెప్పారు. అలానే ఈ నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేట్లను కూడా గోప్యంగా ఉంచారు. ప్రజా వేదికను కూల్చి అక్రమ కట్టడం అని పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడాన్ని ఏమంటారో కూడా ఆయనే చెప్పాలి అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
రుషికొండ ప్యాలెస్‌పై స్పందించిన మాజీ మంత్రి రోజా..
రుషికొండ ప్యాలెస్‌పై వివాధంపై తాజాగా మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా స్పంధించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రుషికొండలోని పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అని అని ప్రశ్నించారు. అలానే వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా..? అని మండిపడ్డారు.
2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ‘61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం... ఇందులో అక్రమం ఎక్కడుంది..? విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...? ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా...? హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..?
ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..? హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా... ఈరోజు విమర్శలు చేసేది..? లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..? అన్న పైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు.. వెనకడుగు వేసేది లేదు..’ అంటూ ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి రోజాకు మతిభ్రమించింది..
రోజా చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లిపాలు కల్లుమూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడడం లేదని అనుకోవడం అవివేకం, పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పు కాదు, కాని ఆ భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఉపయోగించడమే తప్పు. పర్యాటక స్థలాన్ని సందర్శించేందుకు రోజుకు ఎంతమంది పర్యాటకులు వస్తే భవన నిర్మాణానికి వ్యచించిన రూ. 500 కోట్లు తిరిగి వస్తాయి..?
కేవలం మూడు గదులతో, విశాలమైన హాల్లుతో ఉన్న భవనం ఫైవ్ స్టార్ హోటలా..? దీనికీ మళ్లీఅంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాం, అది చూసి అధికార ప్రభుత్వం ఓర్వలేకుందా..? అలసు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకైనా అర్థం అవుతుందా..? ఇలా అనాలోచింతంగా, నోటీకి వచ్చినట్టు మాట్లాడడం కారణంగానే వైసీపీ అదఃపాతాలానికి పడిపోయింది, అయినా మీకు తెలివి రాలేదు, ఐదేళ్లు పర్యాటక శాఖ మంత్రిగా పని చేసిన మీరు రాష్ట్రానికి ఏం చేశారు..?
ఆధాయం వస్తున్న రిసార్ట్స్‌ను నాశనం చేసి దేనికీ పనికిరాని భవానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టాము అని కటింగ్ ఇస్తున్నారంటే మాజీ మంత్రి రోజాకు మతిభ్రమించినట్టు ఉందని పలువురు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.