అన్ని వర్గాల వారితో రాహుల్ మాట్లాడుతారు: జైరాం రమేశ్
ప్రధాని మోడీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు. ఈ మీడింగ్‌లో ఏఐసీసీ అగ్రనేతలు మల్లీఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షులు, పలు రాష్ట్రాల ఇన్ ఛార్జీలు, కీలక నేతలు పాల్గొన్నారు. చర్చల అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇంపాల్ నుంచి ప్రారంభం అవుతుంది.
మణిపూర్ మీదుగా నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అక్కడి నుంచి మేఘాలయా, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రాల్లో కలిపి 15 రాష్ట్రాల్లో యాత్ర ఉంటుందని తెలిపారు. ఈ భారత్ న్యాయ్ యాత్ర 6,700 కిలోమీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు. ఇది హైబ్రిడ్ యాత్ర అని, పాదయాత్ర రూపంలో, బస్సుల్లో యాత్ర రూపంలో ఉంటుందని చెప్పారు. ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ మాట్లాడుతారని అన్నారు. త్వరలోనే భారత్ న్యాయ్‌యాత్ర ప్రారంభం అవుతుందని వెల్లడించారు.