పబ్లిక్‌గా మహిళా ఎమ్మెల్యేపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ (వీడియో)
రాజకీయాలు మరీ దారుణంగా తయారయ్యాయి. రోజు రోజుకూ దిగజారి వ్యక్తిగత కామెంట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ బహిరంగంగా చేసిన ఓ పని తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాలు మరీ దారుణంగా తయారయ్యాయి. రోజు రోజుకూ దిగజారి వ్యక్తిగత కామెంట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ బహిరంగంగా చేసిన ఓ పని తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సతీశ్ గౌతం, ఓ మహిళా ఎమ్మెల్యే పాల్గొన్నారు. వేదికపై ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. ఈ క్రమంలో ఎంపీ గౌతం ఆమెపై చేతులు వేయడంతో ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు. చేతులు తాకుతూ, భుజంపై చేయి వేస్తూ ఎంపీ వెకిలిగా ప్రవర్తించారు. అనంతరం సీటు మార్చుకొని ఆయన వేరే కుర్చీలో కుర్చుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్ని ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో నెటిజన్లు ఎంపీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ये हैं अलीगढ़ के सांसद सतीश गौतम। जो सरेआम कार्यक्रम के बीच में विधायिका मुक्ता राजा से छेड़खानी कर रहे हैं। इनकी इस हरकत से विधायिका जी भी काफ़ी असहज महसूस कर रही हैं।
— UP Congress (@INCUttarPradesh) September 29, 2023
जिस पार्टी के सांसद ही शोहदा हो, उसके छुटभैय्या नेता कैसे होंगे? बाक़ी कार्यकर्ता तो न जाने कैसे-कैसे होंगे?… pic.twitter.com/cSAlEqdvjI