ఓటర్లకు కొత్త ఫిట్టింగ్.. ‘సీల్డ్ కవర్’ కు ఆధార్ లింక్..?
దిశ ప్రతినిది, కరీంనగర్ : ప్రలోభాల ఎరతో ముందుకు సాగుతున్న పొలిటికల్ పార్టీలు ఓటర్లకు కొత్త మెలిక పెట్టాయి. సీల్డ్ కవర్లు తమకు అందలేదంటూ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తుండటంతో ఓటర్లకు సంబంధించిన ఆధార్ కార్డులు చూపించాలని అడుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఓ పార్టీకి చెందిన నాయకులు, ఆయా ప్రాంతాల ఇన్చార్జిల చుట్టూ కొంతమంది ఓటర్లు తిరుగుతుండడంతో వారిని కూడా శాంతింపజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దీంతో తమ వద్దకు వచ్చిన ఓటర్లకు సంబంధించిన ఆధార్ […]
దిశ ప్రతినిది, కరీంనగర్ : ప్రలోభాల ఎరతో ముందుకు సాగుతున్న పొలిటికల్ పార్టీలు ఓటర్లకు కొత్త మెలిక పెట్టాయి. సీల్డ్ కవర్లు తమకు అందలేదంటూ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తుండటంతో ఓటర్లకు సంబంధించిన ఆధార్ కార్డులు చూపించాలని అడుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఓ పార్టీకి చెందిన నాయకులు, ఆయా ప్రాంతాల ఇన్చార్జిల చుట్టూ కొంతమంది ఓటర్లు తిరుగుతుండడంతో వారిని కూడా శాంతింపజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.
దీంతో తమ వద్దకు వచ్చిన ఓటర్లకు సంబంధించిన ఆధార్ కార్డులు చూపించాలని చెప్తున్నారని తెలిసింది. ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా చేసుకుని వారు హుజురాబాద్ ఓటర్లా కాదా అన్న విషయం తెలుసుకున్న తరువాతే వారికి నగదు పంపిస్తున్నట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఓటర్లకు తాయిలాలు ఇచ్చే విషయంలోనూ పొలిటికల్ పార్టీలు పకడ్భందీ చర్యలు చేపడుతుండటం నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.