నిండిన కారు.. ఇక కమలమే దిక్కా..?

షెల్టర్‌ ఛేంజ్‌.. నిన్న ఎక్కడయినా ఉండి ఉండొచ్చు. రేపెక్కడుంటారన్నదే లెక్క. ఆ లెక్కలు పక్కాగా తేలకపోయినా, పక్క చూపులైతే మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీటు సాధించడమే లక్ష్యంగా రాజకీయ నాయకుల అడుగులు పడుతున్నాయి. అవకాశాల కోసం అన్వేషణ మొదలైంది. అధినేతల అంతరంగాలను తెలుసుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయి. వారు ఓకే అంటే వెన్నంటి ఉండటం, మౌనంగా ఉంటే మాత్రం పక్కకు దృష్టి సారిస్తున్నారు. ఆయా పార్టీల్లో వలసల కాలం మొదలైంది. దిశప్రతినిధి, మేడ్చల్ : బల్దియా ఎన్నికల షెడ్యూల్ […]

Update: 2020-11-17 22:51 GMT

షెల్టర్‌ ఛేంజ్‌.. నిన్న ఎక్కడయినా ఉండి ఉండొచ్చు. రేపెక్కడుంటారన్నదే లెక్క. ఆ లెక్కలు పక్కాగా తేలకపోయినా, పక్క చూపులైతే మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీటు సాధించడమే లక్ష్యంగా రాజకీయ నాయకుల అడుగులు పడుతున్నాయి. అవకాశాల కోసం అన్వేషణ మొదలైంది. అధినేతల అంతరంగాలను తెలుసుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయి. వారు ఓకే అంటే వెన్నంటి ఉండటం, మౌనంగా ఉంటే మాత్రం పక్కకు దృష్టి సారిస్తున్నారు. ఆయా పార్టీల్లో వలసల కాలం మొదలైంది.

దిశప్రతినిధి, మేడ్చల్ : బల్దియా ఎన్నికల షెడ్యూల్ మంగళవారం వెలువడడంతో నాయకుల బీపీ పెరుగుతోంది. అప్పుడే సీట్ల కోసం పాట్లు మొదలయ్యాయి. దొరికితే అధికార పార్టీ సీటు.. లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ టికెట్ల కోసం గ్రేటర్ లో పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి వస్తామన్న వారికి బీజేపీ పెద్దపీట వేస్తోంది. అయితే సీట్ల కేటాయింపు.. టీఆర్ఎస్, బీజేపీలలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీసేలా కనిపిస్తోంది.

పక్క చూపులు..

జీహెచ్ఎంసీలోని టీఆర్ఎస్ నేత‌లు, కార్పొరేట‌ర్లు బీజేపీ, కాంగ్రెస్‌లోని ముఖ్య నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లుగా మంత్రి కేటీఆర్ గుర్తించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో 101మంది సిట్టింగ్‌ కార్పొరేటర్లలో కొందరికి అవకాశం వస్తుందా..? రాదా..? అనే భయం వెంటాడుతోంది. అయితే దీనిపై గంద‌ర‌గోళం ఏర్ప‌డ‌డంతో తీరా టికెట్ రాకుంటే చేసేది ఏముంది ముందే మ‌న‌దారి మ‌నం చూసుకుంటే గౌర‌వంగా ప‌క్క పార్టీలో టికెట్ పొందొచ్చు.. గెల‌వొచ్చు అనే ఆలోచ‌న‌తో కొంత‌మంది టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలోని 150డివిజన్లలో 2016 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు చెందిన 99మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. మజ్లిస్‌-44, బీజేపీ-4, కాంగ్రెస్‌-2, టీడీపీ-1 స్థానాలు దక్కించుకున్నాయి. అనంతరం టీడీపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఇద్దరు కారెక్కారు. ప్రస్తుతం అధికార పార్టీ ఖాతాలో 101 డివిజన్లు ఉన్నాయి. 100 స్థానాలు టార్గెట్‌గా.. ప్రజల్లో వ్యతిరేకత లేని అభ్యర్థులను బరిలో నిలపాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయితే కార్పొరేట‌ర్ల‌లో భ‌రోసా నింపేందుకు పార్టీ అధిష్ఠానం సిట్టింగ్‌ల‌కే టికెట్లు అనే అంశాన్ని ముఖ్యుల ద్వారా తెలియ‌జేస్తూ వ‌స్తోంది. అయితే కొంతమంది కార్పొరేట‌ర్లు ఎమ్మెల్యేల వ‌ద్ద హామీ తీసుకుని స‌రే అన‌గా… మ‌రి కొంత‌మంది మాత్రం త‌మ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే గుమ్మ‌నంగా ఉంటూ వ‌స్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

స్పష్టత లేకనే..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్ల కోసం నేతలు ఫీట్లు చేస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ సీట్లపై (టికెట్) ఆశలు పెట్టుకున్న వారికి గుండెదడ పెరిగింది. టీఆర్ఎస్ హౌస్ ఫుల్ గా కనిపిస్తుండడంతో టికెట్లను ఆశిస్తున్న ఆశావహులు పక్క చూపులు చూస్తున్నారు. దుబ్బాక ఎన్నిక తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరగడంతో ఆ పార్టీలో అవకాశం కోసం ఒక కర్చీఫ్ వేస్తున్నారు. ఆ పార్టీ నాయకత్వం కూడా బల్దియా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ టికెట్ కు ఎంత డిమాండ్ ఉందో.. బీజేపీకి అంతే డిమాండ్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దాదాపు 70ఏళ్లు పాలించిన కాంగ్రెస్ టికెట్లను ఆశించిన రీతిలో ఆదరణ లభించడం లేదు. పలు డివిజన్లలో టికెట్లు ఇస్తామన్నా మేము పోటీ చేయమని నాయకులు పేర్కొంటున్నారు. ఇదేమిటని పలువురు నాయకులను ఆరా తీయగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో టికెట్ తీసుకున్నా.. ప్రచారంలో పార్టీ పెద్దల సహకారం ఉండదని, ఎన్నికలను సవాల్ గా తీసుకుని గెలిపించే నాయకుడు పార్టీలో లేరని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆశావహుల చూపులు పక్క పార్టీలవైపు మళ్లింది.

Tags:    

Similar News