ఉత్కంఠ రేపుతున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. వాస్తవానికి టీడీకీ అభ్యర్థులు అత్యధికంగా గెలిచినప్పటికీ వైసీపీ మాత్రం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తోంది. చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే 19 ఓట్లు అవసరం ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థితో కలిపి టీడీపీకి 20 మంది సభ్యుల బలం ఉంది. వారందర్నీ టీడీపీ మున్సిపల్ […]
దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. వాస్తవానికి టీడీకీ అభ్యర్థులు అత్యధికంగా గెలిచినప్పటికీ వైసీపీ మాత్రం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తోంది. చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే 19 ఓట్లు అవసరం ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థితో కలిపి టీడీపీకి 20 మంది సభ్యుల బలం ఉంది. వారందర్నీ టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంపునకు తరలించారు.
అయితే ప్రస్తుతం వైసీపీ ఖాతాలో కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎక్స్ ఆఫిషియో సభ్యులు కీలకంగా మారారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీకి ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు లేదని ఎస్ఈసీ ప్రకటించింది. దీపక్ రెడ్డితోపాటు వైసీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్‌రెడ్డి, శమంతకమణి దరఖాస్తులను సైతం ఈసీ తిరస్కరించింది. తాడిపత్రిలో ఓటు హక్కు లేనందున ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో తిరస్కరించారని.. ఓటు హక్కు ఉన్న చోటే సభ్యత్వం ఉంటుందని కమిషనర్ తెలిపారు.
కేవలం తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎక్స్‌అఫిషియో ఓట్లు జారీ అయ్యాయి. 18న తాడిపత్రి మున్సిపల్ సమావేశానికి హాజరుకావాలని అధికారులు లేఖ రాశారు. దీంతో ఛైర్మన్ ఎన్నికలో సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థి కీలకంగా మారారు. ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలో ఎక్స్ ఆఫిషియో సభ్యులతో ఎలాగైనా కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకునేందుకు వైసీపీ పావులు కదుపుతుంది.