పీఎల్జీఏ వారోత్సవాలు.. పోలీసుల అప్రమత్తం
దిశ, కాటారం: పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ వైపు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తూనే.. మరోవైపు తనిఖీలు ముమ్మరం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో పోలీసులు అడగడుగునా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి పోలీసు అధికారులంతా రంగంలోకి దిగారు. గురువారం తెల్లవారు జామున జిల్లా ఇంఛార్జి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ కాళేశ్వరం చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో అంతరాష్ట్ర రహదారిపై వాహనాలను తనిఖీలు […]
దిశ, కాటారం: పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ వైపు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తూనే.. మరోవైపు తనిఖీలు ముమ్మరం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో పోలీసులు అడగడుగునా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి పోలీసు అధికారులంతా రంగంలోకి దిగారు. గురువారం తెల్లవారు జామున జిల్లా ఇంఛార్జి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ కాళేశ్వరం చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో అంతరాష్ట్ర రహదారిపై వాహనాలను తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టులు రాష్ట్రంలోకి చొరబడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు.