ఈ నెల 30 వరకు ర్యాలీలు, డీజేలు బంద్.. SP సీరియస్ వార్నింగ్
దిశ, ఆదిలాబాద్ : శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం కల్పించడానికి ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. బుధవారం పోలీస్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేస్తూ వివరాలను వెల్లడించారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా అధికారుల నుంచి ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, […]
దిశ, ఆదిలాబాద్ : శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం కల్పించడానికి ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. బుధవారం పోలీస్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేస్తూ వివరాలను వెల్లడించారు.
30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా అధికారుల నుంచి ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అలాగే నిషేధిత ఆయుధాలు, జనజీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారితీసే ప్రజా సమావేశాలు, జనసమూహం, ప్రచార రథాలు, డీజే, సౌండ్ బాక్సులను నిషేధించామన్నారు.
చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1961 ప్రకారం శిక్షకు అర్హులన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా అన్ని వివరాలు దరఖాస్తులో వెల్లడించి అనుమతులు తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, కేంద్ర రక్షణ దళాలు, హోంగార్డులు, ప్రభుత్వ సెక్యూరిటీ గార్డులకు ఆటంకం కలిగించవద్దన్నారు.