పోలీసుల శిక్షణలో ‘రఫీ నోట.. రఫీ పాట’

దిశ, వెబ్‌డెస్క్ : ధృవ సినిమా గుర్తుందా.. అందులో ‘ధృవ ధృవ.. చెడునంతం చేసే స్వార్థమే.. ధృవ ధృవ విధినణిచే విధ్వంసం..’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో టైటిల్ సాంగ్ ప్లే అవుతుంటే.. మరోవైపు పోలీస్ ట్రైనింగ్ సీన్లు తెరపై కనిపిస్తుంటాయి. పోలీసుల శిక్షణ ఎలా ఉంటుందో మచ్చుకు కొన్ని సీన్లను ఆ పాటలో చూపిస్తారు. బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్ వినిపించడం.. తెరపై హీరో వీరోచితంగా ట్రైన్ కావడం.. అదంతా రీల్ లైఫ్‌లో ఓకే. కానీ రియల్ లైఫ్‌లో […]

Update: 2020-06-17 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ధృవ సినిమా గుర్తుందా.. అందులో ‘ధృవ ధృవ.. చెడునంతం చేసే స్వార్థమే.. ధృవ ధృవ విధినణిచే విధ్వంసం..’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో టైటిల్ సాంగ్ ప్లే అవుతుంటే.. మరోవైపు పోలీస్ ట్రైనింగ్ సీన్లు తెరపై కనిపిస్తుంటాయి. పోలీసుల శిక్షణ ఎలా ఉంటుందో మచ్చుకు కొన్ని సీన్లను ఆ పాటలో చూపిస్తారు. బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్ వినిపించడం.. తెరపై హీరో వీరోచితంగా ట్రైన్ కావడం.. అదంతా రీల్ లైఫ్‌లో ఓకే. కానీ రియల్ లైఫ్‌లో సాధ్యమవుతుందా? అంటే.. అదే చేసి చూపిస్తున్నారు.. ఓ తెలంగాణ పోలీసు అధికారి. పాటలు పాడుతూ.. పోలీసులకు ట్రైనింగ్ ఇస్తూ.. వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మహ్మద్‌ రఫీ.. తెలంగాణ పోలీస్ శాఖలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. ప్రస్తుతం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ భారంగా అనిపించకుంగా ఉండేందుకు మ్యాజిక్ ట్రిక్ ప్లే చేస్తున్నారు. రఫీకి.. బాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌ మహ్మద్‌ రఫీ పాటలంటే ప్రాణం. అంతేకాదు.. పాటలు బాగా పాడతారు కూడా. దాంతో ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేదుకు తనకు ఇష్టమైన మహ్మద్ రఫీ పాటలు పాడుతూ, వారికి బూస్టప్ ఇస్తున్నాడు.

ఆ పాట వీడియో..

1970లో వచ్చిన ‘హమ్‌జోలీ’ సినిమాలో మహ్మద్ రఫీ పాడిన ‘దల్‌ గయా దిన్‌.. హో గయి శామ్‌’ పాటను పాడుతూ.. పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ తన ట్విట్టర్లో ‘హ్యాట్సాప్ టూ డ్రిల్ ఇన్స్‌పెక్టర్’ అంటూ పోస్ట్ చేశారు. అదే వీడియోను ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘ఇవి శిక్షణకు కోసం ఆ రఫీ పాడిన మా రఫీ పాటలు. ఒకరేమో పోలీస్‌.. మరొకరేమో లెజండరీ సింగర్‌. ఇద్దరు పేర్లు కామన్‌గా ఉన్నా.. మా రఫీ కూడా పాటలు చాలా బాగా పాడతాడు. ట్రైనీ పోలీసులకు ఫిజికల్ డ్రిల్స్ అందిస్తూనే వారికి ఇంటి బెంగను.. శారీరక శ్రమను మరిచిపోయేలా చేస్తున్నాడు.. నిజంగా ఇది అతనికున్న గొప్ప అభిరుచి’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు.

Tags:    

Similar News