పెద్ద కర్మ కు..పెద్ద నిఘా
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడ గూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యులు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ జూన్ 21 తేదీన కరోనా తో మృతి చెందగా ఆదివారం స్వగ్రామంలో దశదిన కర్మలు మృతుని కుటుంబ సభ్యులు నిర్వహిస్తుండగా పోలీసులు పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేశారు. మడగూడెం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. పెద్ద కర్మ కు హాజరయ్యే […]
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడ గూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యులు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ జూన్ 21 తేదీన కరోనా తో మృతి చెందగా ఆదివారం స్వగ్రామంలో దశదిన కర్మలు మృతుని కుటుంబ సభ్యులు నిర్వహిస్తుండగా పోలీసులు పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేశారు. మడగూడెం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
పెద్ద కర్మ కు హాజరయ్యే వారిపై పోలీసులు ఆరా తీయడంతో పాటు అనుమానం వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి వస్తున్న కొత్తగూడ మండలంలో న్యూ డెమోక్రసీ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హరి భూషణ్ ఇంటిపై జిల్లా పోలీస్ యంత్రాంగం డేగ కన్ను పెట్టారు. సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నేతలు అడ్డుకోవడం దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న వారి పై పోలీస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఏజెన్సీ ప్రజలు భగ్గుమంటున్నారు.
మిగిలిన వంటకాలు..
పెద్ద కర్మ నిమిత్తంబంధువులు, పలు రాజకీయ నేతలు, సామాజిక వేత్తల కోసం వండిన వంటకాలు మిగిలిపోయాయి. ఎవ్వరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఈ కార్యక్రమంకు ఎవ్వరు హాజరుకాలేకపోతున్నారు. గ్రామంలో సుమారు 200 మంది కి పైగా పోలీసులు మోహరించి అడుగుఅడుగున అడ్డుకుంటున్నారు. మడగూడెం గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆధార్ కార్డులు, ఇతర ప్రూఫ్స్ ను పరిశీలిస్తున్నారు. మడగూడెం గ్రామం పూర్తిగా పోలీసు నిర్బంధం లో ఉండడంతో హరిభూషన్ కుటుంబ సభ్యులు స్వేచ్ఛయుతంగా దశదిన కర్మలు చేయలేకపోతున్నామని వాపోతున్నారు.