కేసీఆర్ టూర్‌లో ఎమ్మెల్యేకు ఘోర అవమానం
దిశ ప్రతినిధి, వరంగల్: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. తొలుత పాసులు జారీ చేసి మీడియా కవరేజ్‌కి పోలీసులు అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జర్నలిస్టులు అగచాట్లు పడ్డారు. పోలీసుల తీరుతో నిరసన వ్యక్తం చేశారు. తాజాగా నర్సంపేట అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైంది. హన్మకొండ మీదుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తున్న ఆయనకు అనుమతి లేదని పెద్ది సుదర్శన్ రెడ్డి […]
దిశ ప్రతినిధి, వరంగల్: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. తొలుత పాసులు జారీ చేసి మీడియా కవరేజ్‌కి పోలీసులు అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జర్నలిస్టులు అగచాట్లు పడ్డారు. పోలీసుల తీరుతో నిరసన వ్యక్తం చేశారు. తాజాగా నర్సంపేట అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైంది. హన్మకొండ మీదుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తున్న ఆయనకు అనుమతి లేదని పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. హెడ్ క్వార్టర్స్ వద్దనే పోలీసులు నిలిపివేయడంతో మనస్థాపం చెందిన సుదర్శన్ రెడ్డి కారు దిగారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ నుంచి అర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు నడిచివెళ్లారు. పోలీసుల తీరుకు నిరసనగా అధికార పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యే సీఎం వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని స్థానిక నేతలు మండిపడుతున్నారు. దీనికితోడు ఏకశిలా పార్క్ వద్ద సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్లినా అనుమతి లేదని పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు.