కమ్మేసిన కరోనా.. ఏకంగా పోలీస్ స్టేషన్ మూత !
దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నెల్లూరు జిల్లాలో తీవ్రతరం అవుతోంది.జిల్లాలోని వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో సీఐ, ఎస్సై సహా దాదాపు అందులో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. పీఎస్‌లోని ఏడుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు, పారిశుద్ధ్య కార్మికులను సైతం కరోనా వదల్లేదు. దీంతో ఏకంగా స్టేషన్‌ను మూసి వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కరోనా బారిన పడిన వారందర్నీ క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు.ఇటీవల ఓ హత్య కేసులో నిందితులను ఎలాంటి పరీక్షలు జరపకుండా […]
దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నెల్లూరు జిల్లాలో తీవ్రతరం అవుతోంది.జిల్లాలోని వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో సీఐ, ఎస్సై సహా దాదాపు అందులో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. పీఎస్‌లోని ఏడుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు, పారిశుద్ధ్య కార్మికులను సైతం కరోనా వదల్లేదు. దీంతో ఏకంగా స్టేషన్‌ను మూసి వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కరోనా బారిన పడిన వారందర్నీ క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు.ఇటీవల ఓ హత్య కేసులో నిందితులను ఎలాంటి పరీక్షలు జరపకుండా స్టేషన్ తీసుకువచ్చి విచారించారు. ఈ నేపథ్యంలోనే వెంకటగిరి పోలీసులకు కరోనా సోకినట్టు తేలింది. ఆ హత్య కేసు నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతన్ని విచారించిన పోలీసులందరికీ కరోనా నిర్దారణ జరిగినట్లు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు.