మాస్కు లేకుంటే కోర్టు మెట్లు ఎక్కాల్సిందే

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్డుపైకి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రచారం చేస్తున్నారు. మాస్కులు ధరించనివారికి భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు. కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ కరీంనగర్ జిల్లాలోని గ్రామగ్రామాన పోలీసులు మైక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ ఎస్సై పుప్పాల శ్యాం పటేల్ వినూత్న కార్యక్రమానికి నడుం బిగించారు. […]

Update: 2021-03-30 04:46 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్డుపైకి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రచారం చేస్తున్నారు. మాస్కులు ధరించనివారికి భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు. కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ కరీంనగర్ జిల్లాలోని గ్రామగ్రామాన పోలీసులు మైక్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ ఎస్సై పుప్పాల శ్యాం పటేల్ వినూత్న కార్యక్రమానికి నడుం బిగించారు. సెకండ్ వేవ్ కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని భావించారు. ఆటోలో మైక్ ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో అనౌన్స్ మెంట్ చేయిస్తున్నారు.

ఉదయం అలా… సాయంత్రం ఇలా

ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామగ్రామాన ఆటోలో ప్రచారం చేస్తున్న పోలీసులు.. సాయంత్రం వేళల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో వెహికిల్ చెకింగ్ మాదిరిగానే మాస్క్ చెకింగ్ ప్రోగ్రాం చేపట్టారు. సోమవారం సాయంత్రం నుండి ఈ పద్దతిని అమలు చేస్తున్నారు. మొదటి రోజున 11 మంది మాస్కు లేకుండా కనిపించగా.. వారిని బుధవారం కోర్టులో హాజరు పర్చబోతున్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2020 ప్రకారం మాస్కు లేకుండా తిరుగుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా జీఓ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీఓ ప్రకారం మాస్కు లేకుండా తిరుగుతున్న వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు.

అప్పుడు అలా…

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరువాత కమాన్ పూర్ పోలీసులు కాస్తా డిఫరెంట్ గానే ప్రజలకు సేవలందించారు. అనారోగ్యానికి గురైన వారిని పోలీసు వాహనాల్లో తరలించడం, గర్భిణీలకు సత్వర వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటి పట్టునే ఉన్న రోగులకు మందులు కూడా సరఫరా చేయడంలో కూడా కమాన్ పూర్ పోలీసులు తమ స్పెషాలిటీని చాటుకున్నారు.

చైతన్యం కోసమే…

‘ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కఠినంగా వ్యవహరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ, సీపీలు ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ సమయంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాం. ఇప్పుడు కూడా మొదట్లోనే కట్టడి కోసం ప్రజలను చైతన్య పర్చాలన్న సంకల్పంతో ప్రచారం చేస్తున్నాం. అలాగే మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యం కోసం కఠినంగా వ్యవహరంచక తప్పడం లేదు’ అని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News