అలా చేస్తే.. నేర నియంత్రణ చాలా సులువు : ఏసీపీ గజ్జి కృష్ణ

దిశ, జనగామ: ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమని జనగామ ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. ఆదివారం నర్మెట్ట మండలం కన్నబోయిన గూడెం ప్రజల సహకారంతో నర్మెట్ట ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను ఏసీపీ కృష్ణ, నర్మెట సర్కిల్ ఇన్ స్పెక్టర్ కరుణాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల నియంత్రణ చాలా సులువు అవుతుంది అన్నారు. నేరం […]

Update: 2021-10-17 04:46 GMT

దిశ, జనగామ: ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమని జనగామ ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. ఆదివారం నర్మెట్ట మండలం కన్నబోయిన గూడెం ప్రజల సహకారంతో నర్మెట్ట ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను ఏసీపీ కృష్ణ, నర్మెట సర్కిల్ ఇన్ స్పెక్టర్ కరుణాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల నియంత్రణ చాలా సులువు అవుతుంది అన్నారు. నేరం చేసి పారిపోతే, నిందితులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, గ్రామం లోకి కొత్తగా ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఏం జరుగుతుందనేది క్షణాల్లో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏసీపీ ప్రత్యేకంగా తెలియజేశారు. అదేవిధంగా నర్మెట సర్కిల్ లోని పలు గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. మిగతా గ్రామాల ప్రజలు, పోలీసుల సూచనల మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోని సహకరించాలని కోరారు. కన్నబోయిన గూడెం లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సర్పంచ్ హేమలత, గ్రామ ప్రజలను ఏసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ కరుణాకర్ ఎస్ ఐ రవి కుమార్ ఉన్నారు.

Tags:    

Similar News