‘కరోనా’ హెల్మెట్‌తో పోలీసుల అవగాహన

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు. మంగళవారం హైదరాబాద్ కమిషనర్ అంజనీ‌కుమార్ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై మరింత అవగాహన కల్పించేలా… కరోనా వైరస్‌ను పోలిన హెల్మెట్లు ధరించారు. బైకులు, గుర్రాలపై తిరుగుతూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ సమయంలో నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన ప్రజలు, డ్యూటీకి వెళ్తున్న ఉద్యోగులకు సూచనలు చేశారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తే ఈ […]

Update: 2020-03-31 08:41 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు. మంగళవారం హైదరాబాద్ కమిషనర్ అంజనీ‌కుమార్ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై మరింత అవగాహన కల్పించేలా… కరోనా వైరస్‌ను పోలిన హెల్మెట్లు ధరించారు. బైకులు, గుర్రాలపై తిరుగుతూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ సమయంలో నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన ప్రజలు, డ్యూటీకి వెళ్తున్న ఉద్యోగులకు సూచనలు చేశారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తే ఈ మహమ్మారి మన ధరి చేరదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందని, ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా సహకరించాలని కోరారు.

Tags: Corona, helmet, Hyderabad Police Commissioner, Anjani Kumar, bikes, horses

Tags:    

Similar News