మిస్టరీ వీడిన టైలర్ మృతి

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అనుమానస్పద స్థితిలో మృతి చెందిన టైలర్ మిస్టరీ వీడింది. ఘట్‎కేసర్ పరిధిలో జరిగిన టైలర్ గంగారం అంజయ్య హత్య కేసును పోలీసులు చేధించారు. ఇన్‎స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‎కేసర్‎లోని ఎన్ఎఫ్‎సీ నగర్‎లో గంగారం అంజయ్య, తన భార్య భవానీ, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఘట్‎కేసర్ టౌన్‎లో ఓ షాపులో కూలీగా టైలర్ వృత్తి చేస్తూ.. మద్యానికి బానిసై భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. గత పదేళ్లుగా ఇదే తరహాలో […]

Update: 2020-10-08 09:50 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అనుమానస్పద స్థితిలో మృతి చెందిన టైలర్ మిస్టరీ వీడింది. ఘట్‎కేసర్ పరిధిలో జరిగిన టైలర్ గంగారం అంజయ్య హత్య కేసును పోలీసులు చేధించారు.

ఇన్‎స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‎కేసర్‎లోని ఎన్ఎఫ్‎సీ నగర్‎లో గంగారం అంజయ్య, తన భార్య భవానీ, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఘట్‎కేసర్ టౌన్‎లో ఓ షాపులో కూలీగా టైలర్ వృత్తి చేస్తూ.. మద్యానికి బానిసై భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. గత పదేళ్లుగా ఇదే తరహాలో భర్త వేధిస్తుండడంతో ఎలాగైనా భర్తను మద్యం మానిపించాలని భవాని ఓ ఆయుర్వేదిక మెడిసిన్ సప్లై చేసే వ్యక్తిని కలిసింది. మెడిసిన్ ఇప్పిస్తానని నమ్మబలికి ఆ తర్వాత క్రమంలో భవానితో ఆక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు గోపి సతీష్ కుమార్. ప్రియుడి మోజులో పడిన భవాని భర్త అంజయ్యను అంతమొందించాలని నిర్ణయించుకుంది.

హత్య పథకంలో భాగంగా ఈ నెల 1వ తేదీన భవానీ కొడుకు ఉద్యోగానికి వెళ్లగానే ప్రియుడు గోపి సతీష్ కుమార్‎ను ఇంటికి పిలిచింది. నిద్రిస్తున్న భర్త ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపాలని భావించగా, వారి హత్యాయత్నం నుంచి అంజయ్య తప్పించుకున్నాడు. అంజయ్యను ఎలాగైనా చంపాలనుకున్న భార్య వంటింట్లో ఉన్న రోకలి బండను తీసుకువచ్చి భర్త తలపై బలంగా కొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అంజయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసి.. భవానీ 100కు కాల్ చేసి, తన భర్త అంజయ్య ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తలపై తీవ్ర గాయాలతో ఇంటికి వచ్చాడని అతని తలకు తీవ్ర రక్తస్రావమై చనిపోయాడని తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు భార్యపైనే అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. భవాని, తన ప్రియడు గోపి సతీష్ కుమార్ సహాయంతో హతమార్చినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.

Tags:    

Similar News