కాయ్ రాజా కాయ్.. అమెజాన్ లో అమ్మకానికి గంజాయ్..

దిశ, వెబ్ డెస్క్ : ఆన్ లైన్ లో గంజాయి అమ్ముతున్న స్మగ్లింగ్ రాకెట్ యవ్వారాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు బయటపెట్టారు. వీటి అమ్మకాలకు సహకరించిన ‘అమెజాన్ ఇండియా’ పై శనివారం కేసు నమోదు చేశారు. స్వీట్ రాకెట్ పేరుతో జరుగుతున్న మాఫియాను ఎట్టకేలకు కనిపెట్టామని పోలీసులు తెలిపారు. దాంతో అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పై నార్కోటిక్స్ డ్రగ్స్ చట్టంలోని 38 వ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు భింద్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ […]

Update: 2021-11-21 04:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆన్ లైన్ లో గంజాయి అమ్ముతున్న స్మగ్లింగ్ రాకెట్ యవ్వారాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు బయటపెట్టారు. వీటి అమ్మకాలకు సహకరించిన ‘అమెజాన్ ఇండియా’ పై శనివారం కేసు నమోదు చేశారు. స్వీట్ రాకెట్ పేరుతో జరుగుతున్న మాఫియాను ఎట్టకేలకు కనిపెట్టామని పోలీసులు తెలిపారు. దాంతో అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పై నార్కోటిక్స్ డ్రగ్స్ చట్టంలోని 38 వ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు భింద్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఏఎస్ఎస్ఎల్ పేరిట ఈ కామర్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించామన్నారు.

విశాఖ పట్నం నుంచి ఈ సరుకును ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి మధ్యప్రదేశ్ లో విక్రయిస్తున్నారని మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు . ఈ నెల 13న ఇద్దరు గ్వాలియర్ వాసుల నుంచి 22.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిషేధిత వస్తువుల అమ్మకాలను తమ సంస్థ ద్వారా అమ్మబోమని అమెజాన్ చాలా సార్లు ప్రకటించింది. అందుకు తాము కట్టుబడి ఉన్నామని పోలీసులకు సహకరిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

Tags:    

Similar News