వీడిన సుజాత మర్డర్ మిస్టరీ.. కోరిక తీర్చనందుకే చంపాడు!

దిశ, జవహర్ నగర్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని భజరంగ్ నగర్ కాలనీలో ఈనెల 11న తన భార్య సుజాత(25) అదృశ్యం అయిందని భర్త మహదేవ్‌పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఈనెల 14న అడవిలో శవంగా కనిపించిన సుజాతను గుర్తించారు. ఆమె మృతిపై అనేక అనుమానాలతో విచారణ ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు నిందితున్ని గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన సుజాత పక్కింట్లో ఉండే అంజనేయులే(43) నిందితుడు అని […]

Update: 2021-09-19 00:29 GMT

దిశ, జవహర్ నగర్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని భజరంగ్ నగర్ కాలనీలో ఈనెల 11న తన భార్య సుజాత(25) అదృశ్యం అయిందని భర్త మహదేవ్‌పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఈనెల 14న అడవిలో శవంగా కనిపించిన సుజాతను గుర్తించారు. ఆమె మృతిపై అనేక అనుమానాలతో విచారణ ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు నిందితున్ని గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన సుజాత పక్కింట్లో ఉండే అంజనేయులే(43) నిందితుడు అని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే… కొంతకాలం క్రితం ఆంజనేయులను రూ.5 వేలు చేతుబదులు కింద అడిగింది. దీంతో అప్పటికే సుజాతపై కన్నేసిన ఆయన అప్పు అడిగిన నాటినుంచి చనువుగా ఉండటం ప్రారంభించారు.

ఇదే అదునుగా భావించి, వికలాంగుల కాలనీ సమీపంలోని ఫారెస్ట్ రేంజ్ అడవిలోకి ఆమెను తీసుకెళ్ళాడు. అనంతరం తన కోరిక తీర్చాలని బలవంత పెట్టాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసి, సుజాత తలపై గ్రానైట్ రాయితో బలంగా కొట్టి చంపేశాడు. ఈ విషయాన్ని ఆంజనేయులు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో శనివారం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వంలో అదనపు సీపీ సుధీర్ బాబు, డిప్యూటీ సీపీ రక్షిత కృష్ణమూర్తి, ఏఎస్పీ, ఏసీపీ శివ కుమార్, సీఐ భిక్షపతి రావు, ఎస్ఐలు మోహన్, శ్రీధర్ రెడ్డిలు ఈ కేసును చేధించారు.

Tags:    

Similar News