పొలం పనులకు పోయినా ఫైనేనా…?
దిశ, వేములవాడ: హెల్మెట్ అనేది తప్పనిసరి.. అయితే ఏదైనా ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ధర్మారం గ్రామంలో ఓ రైతు తన పొలం పనులకు వెళ్తుండగా నెత్తికి హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్ వేశారు. దీంతో ఆ రైతు నివ్వెరపోయాడు. ధర్మారం గ్రామానికి చెందిన పొన్నం మల్లశేం తన స్కూటీపై రోజులాగే పొలం పనులకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో తాను […]
దిశ, వేములవాడ: హెల్మెట్ అనేది తప్పనిసరి.. అయితే ఏదైనా ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ధర్మారం గ్రామంలో ఓ రైతు తన పొలం పనులకు వెళ్తుండగా నెత్తికి హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్ వేశారు. దీంతో ఆ రైతు నివ్వెరపోయాడు. ధర్మారం గ్రామానికి చెందిన పొన్నం మల్లశేం తన స్కూటీపై రోజులాగే పొలం పనులకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో తాను హెల్మెట్ ధరించలేదని పోలీసులు రూ.200 వందలు ఫైన్ వేయడంతో పాటు యూజర్ ఛార్జ్ రూ.35 వేయడంతో మల్లేశం అవాక్కయ్యాడు. పోలీసులు అన్ని విషయాల్లో కూడా ఇదే విధంగా విధులు నిర్వహించాలని బాధితుడు కోరుతున్నాడు.