వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్.. జైలు నుంచి వచ్చి మళ్లీ అదే పని చేస్తూ..
దిశ, ఎల్బీనగర్: వ్యభిచార గృహంపై ఎల్బీనగర్ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితోపాటు విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సెల్‌ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మంగూరు లక్ష్మీపురం కాలనీకి చెందిన సోంశెట్టివ వెంకట లక్ష్మీ (68) ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్‌గూడ, పండిపుల్లా రెడ్డి గార్డెన్ లేన్‌లోని రెడ్డి కాలనీలో తన సోదరుడి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు […]
దిశ, ఎల్బీనగర్: వ్యభిచార గృహంపై ఎల్బీనగర్ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితోపాటు విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సెల్‌ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మంగూరు లక్ష్మీపురం కాలనీకి చెందిన సోంశెట్టివ వెంకట లక్ష్మీ (68) ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్‌గూడ, పండిపుల్లా రెడ్డి గార్డెన్ లేన్‌లోని రెడ్డి కాలనీలో తన సోదరుడి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి విటుడు చట్టి సద్గుణరావు (52)తో పాటు సోంశేటి వెంకటక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు.
అయితే 20 ఏళ్ల క్రితం నిర్వాహకురాలు వెంకటలక్ష్మీని భర్త వదిలి వేయడంతో బైరామల్‌గూడ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు వ్యభిచార వృత్తిని ఎంచుకుంది. తనకు తెలిసిన మహిళా సెక్స్‌వర్కర్లతో ఒప్పందం చేసుకుని వ్యభిచార గృహాన్ని నిర్వహింస్తుంది. కాగా గతంలో విటుడు కాకనంపాటి యలమంధరావుతో పాటు వెంకటలక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తలించారు. అనంతరం బెయిల్‌పై తిరిగి వచ్చి మళ్లీ అదే వృత్తిని కొనసాగింస్తుంది. దీంతో విటుడితోపాటు నిర్వాహకురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.