ఏపీ, ఒడిశా బోర్డర్‌లో పోలీసుల కూంబింగ్

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, ఒడిశా బోర్డర్‌లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టుల కోసం సెర్చింగ్ చేస్తున్నారు. పెద్దబయలు మండలం లండూల అటవీప్రాంతంలో మూడు రోజుల క్రితం కాల్పులు జరగడంతో మావోయిస్టులు గాయపడ్డారని పోలీసులు ప్రకటన చేశారు. వారిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్‌ చేపట్టారు. అటు ముంచంగిపుట్టు మండలం రూఢకోటలో బాంబు స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇటు తెలంగాణలో కూడా చాలారోజుల తర్వాత మావోయిస్టుల అలజడి మొదలు కావడంతో మూడ్రోరోజుల క్రితం […]

Update: 2020-07-21 06:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, ఒడిశా బోర్డర్‌లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టుల కోసం సెర్చింగ్ చేస్తున్నారు. పెద్దబయలు మండలం లండూల అటవీప్రాంతంలో మూడు రోజుల క్రితం కాల్పులు జరగడంతో మావోయిస్టులు గాయపడ్డారని పోలీసులు ప్రకటన చేశారు. వారిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్‌ చేపట్టారు. అటు ముంచంగిపుట్టు మండలం రూఢకోటలో బాంబు స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇటు తెలంగాణలో కూడా చాలారోజుల తర్వాత మావోయిస్టుల అలజడి మొదలు కావడంతో మూడ్రోరోజుల క్రితం డీజీపీ మహేందర్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున్న బలగాలను మోహరించారు. ఆదిలాబాద్ జిల్లా తిర్యానీ అడవుల్లో గ్రే హౌండ్స్ పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు.

Tags:    

Similar News