ఇంట్లో ఉన్న స్కూటీకి పోలీసుల చలానా .. ‘దిశ’ను ఆశ్రయించిన బాధితుడు
దిశ, బోథ్ : ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. బైక్ ఒకరిదైతే.. చలానా మాత్రం వేరొకరికి విధించారు పోలీసులు. వివరాల ప్రకారం.. బోథ్ మండల కేంద్రానికి చెందిన వొడ్నాల గజ్జరం బోథ్‌లో నివసిస్తున్నారు. తనకు TS 01 EN 9876 నంబర్ గల స్కూటీ ఉంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో స్కూటీ తన ఇంట్లోనే పార్క్ చేసి […]
దిశ, బోథ్ : ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. బైక్ ఒకరిదైతే.. చలానా మాత్రం వేరొకరికి విధించారు పోలీసులు. వివరాల ప్రకారం.. బోథ్ మండల కేంద్రానికి చెందిన వొడ్నాల గజ్జరం బోథ్‌లో నివసిస్తున్నారు. తనకు TS 01 EN 9876 నంబర్ గల స్కూటీ ఉంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో స్కూటీ తన ఇంట్లోనే పార్క్ చేసి ఉంది.
ఈ క్రమంలో అతని ఫోన్‌కు 2 గంటల 14 నిమిషాలకు ఓ మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఓపెన్ చేస్తే 135 రూపాయల జరిమానా విధించినట్టు ఉంది. అది చూసి గజ్జరం కంగుతిన్నాడు. స్కూటీ ఇంట్లోనే ఉంటే పోలీసులు ఎలా జరిమానా వేసారని చలానాను చూడగా.. తన నెంబర్‌తో మరో బైక్ తిరుగుతున్నట్టు గమనించాడు. అనంతరం గజ్జరం.. ‘దిశ’ను ఆశ్రయించి విషయం తెలిపాడు. తన నెంబర్‌తో ఉన్న బైకును నడుపుతున్న వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.