TRS MLA Bethi Subhas Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై కేసు నమోదు..
దిశ, జవహర్ నగర్ : ఓ భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎమ్మెల్యే, కాప్రా తహసీల్దార్‌పై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ మధు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా మండల పరిధిలోని సర్వే నెంబర్ 152 లో గల భూమి తనదే అంటూ ఆస్తి హక్కులకై న్యాయస్థానాల్లో జులకాంటి నాగరాజు అనే వ్యక్తి.. తన తరఫు న్యాయవాది మేకల శ్రీనివాస్ యాదవ్‌తో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ భూమి […]
దిశ, జవహర్ నగర్ : ఓ భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎమ్మెల్యే, కాప్రా తహసీల్దార్‌పై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ మధు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా మండల పరిధిలోని సర్వే నెంబర్ 152 లో గల భూమి తనదే అంటూ ఆస్తి హక్కులకై న్యాయస్థానాల్లో జులకాంటి నాగరాజు అనే వ్యక్తి.. తన తరఫు న్యాయవాది మేకల శ్రీనివాస్ యాదవ్‌తో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఆ భూమి కస్టోడియన్ పరిధిలోకి వస్తుందంటూ తహసీల్దార్ గౌతమ్ కుమార్ తన సిబ్బందితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ( Bethi Subhas Reddy ) అనుచరులు వచ్చి ఆ భూమిలోని ఫెన్సింగ్‌ను జేసీబీలతో తొలగించారని అన్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో పాటు, ఓ జేసీబీ డ్రైవర్ జూలకంటిని చంపుతామని బెదిరించారు. సెటిల్మెంట్ల పేరు మీద డబ్బులు డిమాండ్ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అవి ప్రభుత్వ భూములుగా తప్పుడు రికార్డులు సృష్టించారు. ఇదే అంశంపై బాధితులు మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యే, తహసీల్దారుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.