ఆ కారులో రేప్ చేయవచ్చునా? డోర్ తీసుకుని పారిపోలేరుగా..?
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఒక కేసు ను పరిష్కరించడానికి పోలీసులు వేరే డిపార్టుమెంట్ సహాయం తీసుకొంటూ ఉంటారు. ఆధారాలను సేకరించే క్రమంలో వారిని అనేక ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. అయితే పోలీసులు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో వారికి తెలుసు.. కానీ ఇక్కడ పోలీసులు అడిగిన వింతప్రశ్నలకు ఆ అధికారులు సైతం విస్తుపోయారు. పోలీసులు అడగాల్సిన ప్రశ్నలేనా..అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ పోలీసులు అడిగిన ఆ వింత ప్రశ్నలు ఏంటివి..? అసలు ఆ కేసు […]
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఒక కేసు ను పరిష్కరించడానికి పోలీసులు వేరే డిపార్టుమెంట్ సహాయం తీసుకొంటూ ఉంటారు. ఆధారాలను సేకరించే క్రమంలో వారిని అనేక ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. అయితే పోలీసులు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో వారికి తెలుసు.. కానీ ఇక్కడ పోలీసులు అడిగిన వింతప్రశ్నలకు ఆ అధికారులు సైతం విస్తుపోయారు. పోలీసులు అడగాల్సిన ప్రశ్నలేనా..అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ పోలీసులు అడిగిన ఆ వింత ప్రశ్నలు ఏంటివి..? అసలు ఆ కేసు ఎవరికి సంబంధించింది అనేది తెలుసుకుందాం.
గుజరాత్ కి చెందిన స్థానిక నేత భవేష్ పటేల్‌పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. అతడు తన టొయోటా ఫార్చునర్ కారులో ఓ మహిళను ఏప్రిల్ 26 అర్ధరాత్రి రేప్ చేశాడని తెలియడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసే కాకుండా అతనిపై మరో 18 కేసులు ఉండడంతో అతనిని ఎలాగైనా జైలుకు పంపాలని నిర్ణయించుకున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితిలోను అతడు తప్పించుకోకుండా బలమైన ఆధారాలను సేకరించాడనికి సిద్ధమయ్యారు. రేప్ చేసినప్పుడు యువతి ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదని ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం చెప్పలేక తప్పించుకొంటాడేమో అని పోలీసులు ఆర్డీవో అధికారుల వద్దకు వెళ్లి.. టొయోటా ఫార్చునర్ కారులో రేప్ చేసేంత స్థలం ఉంటుందా? సీట్లు ముందుకు జరిపితే కుదురుతుందా? ఆ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ బలంగా ఉందా అన్న ప్రశ్నలు ఆర్టీవోను అడిగారు. ఈ ప్రశ్నలు విన్న ఆర్డీవో అధికారులు షాక్ అయ్యారు.
ఇప్పటివరకు ఇలాంటి ప్రశ్నలు వినలేదని, అది పోలీసులు అడగడం ఆశ్చర్యంగా ఉందని వారు తెలిపారు. అయితే తాము మ్యాథమెటికల్ రిపోర్ట్ మాత్రం ఇస్తామని, స్థలం ఎంత ఉంటుంది? సీట్లు జరిపితే ఇంకా ఎంత స్థలం ఉంటుందనే వివరాలను మాత్రమే ఇవ్వగలమని చెప్పారు. అందులో రేప్ జరగడానికి ఎంత స్థలం సరిపోతుంది అనేది తమకు తెలియదని అన్నారు. ప్రస్తుతం ఈ ప్రశ్నలతో ఈ కేసు గుజరాత్ లో హాట్ టాపిక్ గా మారింది.