అలారంతో నిద్రలేచి.. అర్ధరాత్రి చోరీలు

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌ నగర శివారులో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున తొర్రూరు ఎక్స్‌రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో చేసిన దొంగతనాలను నిందితులు అంగీకరించారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పొన్నాల శివశంకర్ (ఏ1), మణుగూరుకు చెందిన ఇండ్ల సోమ శివశంకర్ (ఏ2)లు మణుగూరు, పాల్వంచలో దొంగతనాలకు […]

Update: 2020-06-16 10:20 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌ నగర శివారులో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున తొర్రూరు ఎక్స్‌రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో చేసిన దొంగతనాలను నిందితులు అంగీకరించారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పొన్నాల శివశంకర్ (ఏ1), మణుగూరుకు చెందిన ఇండ్ల సోమ శివశంకర్ (ఏ2)లు మణుగూరు, పాల్వంచలో దొంగతనాలకు పాల్పడి జీలు జీవితం గడిపారు. 2005 నుంచి 2019 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోరీలకు పాల్పడిన ఏ1 శివశంకర్‌పై 35కేసులు ఉండగా, పీడీయాక్ట్ నమోదైంది. మరో నిందితుడు ఏ2 ఇండ్ల సోమ శివశంకర్‌ 2002 నుంచి 2018వరకు పలు చోరీలు చేయగా 7 కేసులు నమోదయ్యాయి. చోరీ కేసుల్లో జైలు జీవితం గడిపిన వీరు 2019 డిసెంబర్‌లో విడుదలయ్యాయి. వారంరోజుల్లో ఫోన్ ద్వారా మళ్లీ కాంటాక్ట్ అయి హైదరాబాద్‌లో దొంగతనాలకు స్కెచ్ గీశారు. ఇదే క్రమంలో నగర శివారులోని ఐసోలేషన్ ప్రాంతంలోని తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని చోరీలు చేయడం మొదలు పెట్టారు. పగలంతా మద్యం సేవించి, రాత్రి ఒంటిగంటకు అలారం పెట్టుకొని నిద్రలేచిన తర్వాత దొంగతనాలు చేసేవారు. ఈ నేపథ్యంలోనే ఇళ్లలో పాచిపని చేసే అంబాల నాగమణి పరిచయమై వీరికి సహకరించింది. 2019 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు హయత్‌నగర్, వనస్థలిపురం, పహాడిషరీఫ్, జవహార్ నగర్, ఆదిభట్ల, ఘట్‌కేసర్, మేడిపల్లి, చౌటుపల్ల్, భువనగిరిలో 26 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున తొర్రూరు ఎక్స్ రోడ్డులో తాళం వేసిన ఇళ్ల దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో నిందితులు చోరీల విషయాన్ని అంగీకరించారు. వీరి నుంచి రూ.21.20లక్షల విలువైన 28.5 తులాల బంగారం, 3.2కిలోల వెండి, రోల్ గోల్డ్, రెండు టీవీలు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News