ఛీ ఛీ.. పుణ్యక్షేత్రంలో పాడుపని.. రాసలీలల అడ్డాగా అలిపిరి
దిశ, వెబ్‌డెస్క్: సమాజం రోజురోజుకు చెడిపోతుంది. డబ్బుకోసం ఎంతటి నీచానికైనా సిద్దపడుతున్నారు కొంతమంది. పవిత్ర స్థలంలో చెప్పులతో నడిస్తేనే పాపం అనుకుంటారు. కానీ పవిత్రమైన పుణ్యక్షేత్రం సమీపంలో పాడు పనులకు తెరలేపారు. పవిత్రమైన స్థలాన్ని.. రాసలీలల అడ్డాగా మార్చేశారు. ఎవరికి అనుమానం రాకుండా లాడ్జి పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. తిరుపతి.. పుణ్యక్షేత్రం.. ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలిపిరి పోలీస్ […]
దిశ, వెబ్‌డెస్క్: సమాజం రోజురోజుకు చెడిపోతుంది. డబ్బుకోసం ఎంతటి నీచానికైనా సిద్దపడుతున్నారు కొంతమంది. పవిత్ర స్థలంలో చెప్పులతో నడిస్తేనే పాపం అనుకుంటారు. కానీ పవిత్రమైన పుణ్యక్షేత్రం సమీపంలో పాడు పనులకు తెరలేపారు. పవిత్రమైన స్థలాన్ని.. రాసలీలల అడ్డాగా మార్చేశారు. ఎవరికి అనుమానం రాకుండా లాడ్జి పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తిరుపతిలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. తిరుపతి.. పుణ్యక్షేత్రం.. ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న ఆర్య నివాస్ లాడ్జీ స్వామివారి ఆలయానికి దగ్గర్లోనే ఉంటుంది. వచ్చిన భక్తులు సేదతీరడానికి పెద్ద సంఖ్యలో వస్తారు. అయితే వచ్చినవారికి గదులను ఏర్పాటు చేస్తామని నమ్మబలికి వారిని లాడ్జీకి తీసుకెళ్లి వ్యభిచారం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
మంగళం క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఒక మహిళ.. పూణె, కలకత్తాకు చెందిన యువతులను తిరుపతికి తీసుకువచ్చి.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు లాడ్జీపై రైడ్ చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్డీపై దాడి చేసి ముగ్గురు మహిళలు సహా, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.