మావోయిస్టులపై మరో వ్యూహం.. అనారోగ్యంగా ఉన్నారంటూ ప్రచారం?
దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీని బలహీన పర్చేందుకు పోలీసులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించకుంటున్నారా.?, నిజంగానే మావోయిస్టులు అనారోగ్యంతో కొట్టు మిట్టాడుతున్నారా.?, ఇప్పుడీ మిస్టరీ చిక్కుముడి వీడాలంటే ఎలా అన్నదే సవాల్‌గా మారింది. కరోనా మహమ్మారితో మావోయిస్టులు కొట్టుమిట్టాడుతున్నారంటూ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు, జనతన్ సర్కార్‌లో ఎడ్యుకేషన్ వింగ్‌లో టీచర్‌గా పనిచేస్తున్న కత్తి మోహన్ రావు అలియాస్ దామదాదా మరణించినట్టు మావోయిస్టు పార్టీ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టు పార్టీని బలహీన పర్చేందుకు పోలీసులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించకుంటున్నారా.?, నిజంగానే మావోయిస్టులు అనారోగ్యంతో కొట్టు మిట్టాడుతున్నారా.?, ఇప్పుడీ మిస్టరీ చిక్కుముడి వీడాలంటే ఎలా అన్నదే సవాల్‌గా మారింది. కరోనా మహమ్మారితో మావోయిస్టులు కొట్టుమిట్టాడుతున్నారంటూ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు, జనతన్ సర్కార్‌లో ఎడ్యుకేషన్ వింగ్‌లో టీచర్‌గా పనిచేస్తున్న కత్తి మోహన్ రావు అలియాస్ దామదాదా మరణించినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కరోనా చికిత్స కోసం వచ్చి పోలీసులకు చిక్కడం, ఒకరు చనిపోవడంతో మావోయిస్టులు తీవ్ర అనారోగ్యానికి గురువతున్నారన్న ప్రచారం తీవ్రంగా పెరిగింది.
దండకారణ్య అటవీ ప్రాంతంలో పని చేస్తున్న ముఖ్య నాయకులు అనారోగ్యంగా ఉన్నారన్న సమాచారం కూడా వారి కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు. దీంతో ఆయా నాయకులు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. పోలీసు వర్గాలు కూడా అనారోగ్యానికి గురువుతన్న బిడ్డలార ఇంటి బాట పట్టండని మీడియా ద్వారా పిలుపు ఇవ్వాలన్న సూచనల కూడా పంపిస్తున్నారు. దీంతో మావోయిస్టు పార్టీ నాయకులు ఫ్యామిలీ మెంబర్స్ అప్పీల్ చేయడం ఆరంభిస్తే ఒకరో ఇద్దరు బయటకు వస్తారన్న అంచనాతో ఉన్నట్టు స్పష్టం అవుతోంది.
తాజాగా సీసీ మెంబర్ల వంతు..
గత రెండు మూడ్రోజులుగా డీకే ఏరియాలో సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్న పలువురు అనారోగ్యానికి గురయ్యారంటూ ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మహబూబాబాద్‌కు చెందిన యాప నారాయణ అలియాస్ హరి భూషన్ తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారంటూ చత్తీస్‌గడ్‌లోని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు దంతెవాడ ఎస్పీ కూడా అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. సుక్మా జిల్లా మీనాగుట్ట ప్రాంతంలో హరిభూషన్ చనిపోయాడనే ప్రకటించారు. మరో వైపున మావోయిస్టు పార్టీకి చెందిన మరో ముగ్గురు అగ్ర నాయకులు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న ప్రచారం కూడా మొదలైంది.
మావోయిస్టుల కౌంటర్..
గత నెల రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారం అంతా బూటకమేనని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇదంతా మావోయిస్టు పార్టీని వీక్ చేసే కుట్రలో భాగమేనని కూడా ఆరోపించారు. దీంతో దండకారణ్య అటవీ ప్రాంతంలో నాయకులు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అన్న విషయంపై మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి చెప్పాల్సిన పరిస్థితి తయారైంది.