బీజాపూర్‌లో ఎదురు కాల్పులు

దిశ,భద్రాద్రి : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పామ్ హెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమట్ పల్లి అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే..కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు మావోలు ఎదురుపడ్డారు. పోలీసులను గమనించి మావోలు కాల్పులు జరపగా…పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లేదా ముగ్గురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని . ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలంలో […]

Update: 2020-12-25 04:26 GMT

దిశ,భద్రాద్రి : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పామ్ హెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమట్ పల్లి అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే..కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసులకు మావోలు ఎదురుపడ్డారు. పోలీసులను గమనించి మావోలు కాల్పులు జరపగా…పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లేదా ముగ్గురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని . ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలంలో పంపులు, సాహిత్యం, యూనిఫాంలు, మందులు, ఎస్‌ఎల్‌ఆర్ రౌండ్లు, ఖాళీ కియోస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు.

Tags:    

Similar News