పోలవరం సాంకేతిక సలహాదారుపై వేటు
దిశ ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్కే సాహును విధుల నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక, న్యాయ సలహాల కోసం నెలకు రూ. 2 లక్షల వేతనంతో హెచ్కే సాహును ఏప్రిల్ 14, 2018న కన్సల్టెంట్గా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం […]
దిశ ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్కే సాహును విధుల నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక, న్యాయ సలహాల కోసం నెలకు రూ. 2 లక్షల వేతనంతో హెచ్కే సాహును ఏప్రిల్ 14, 2018న కన్సల్టెంట్గా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. దీంతో ఆయనను కన్సల్టెంట్గా ప్రభుత్వం తొలగించింది.