చెరువులో విష ప్రయోగం..? లక్షల విలువైన చేప పిల్లలు మృతి
దిశ, నర్సాపూర్ : చెరువులో విష పదార్థాలు కలపడంతో లక్షల విలువైన చేప పిల్లలు చనిపోయాయని చెరువు లీజుదారులు కన్నీరుమున్నీరు అయ్యారు. మెదక్ జిల్లా నర్సాపుర్ మండలంలో జరిగిన ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ కొమ్మని చెరువును భవాని, రామకృష్ణ దంపతులు రూ.1.50 లక్షలకు లీజుకు తీసుకున్నారు. మరో రూ.3 లక్షలు అప్పుచేసి చెరువులో చేప పిల్లలు విడిచి పెంచుతున్నారు. అయితే మంగళవారం ఉదయం చెరువులోని చేప పిల్లలు […]
దిశ, నర్సాపూర్ : చెరువులో విష పదార్థాలు కలపడంతో లక్షల విలువైన చేప పిల్లలు చనిపోయాయని చెరువు లీజుదారులు కన్నీరుమున్నీరు అయ్యారు. మెదక్ జిల్లా నర్సాపుర్ మండలంలో జరిగిన ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ కొమ్మని చెరువును భవాని, రామకృష్ణ దంపతులు రూ.1.50 లక్షలకు లీజుకు తీసుకున్నారు. మరో రూ.3 లక్షలు అప్పుచేసి చెరువులో చేప పిల్లలు విడిచి పెంచుతున్నారు. అయితే మంగళవారం ఉదయం చెరువులోని చేప పిల్లలు అనుమానస్పందంగా చనిపోయి నీటిలో తేలియాడాయి. చెరువు నీటిలో విషప్రయోగం చేసి చేపలను చంపేశారని బాధిత దంపతులు ఆరోపించారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేకే గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మత్య్సశాఖ అధికారులు తమను ఆదుకోవాలని భవాని, రామకృష్ణ దంపతులు కోరారు.