పెళ్లిలో మిగిలిపోయిన స్వీట్స్ ఎంత పని చేశాయి
పెళ్లిలో మిగిలిపోయిన స్వీట్స్ పదిమంది పాలిట శాపంగా మారాయి. కృష్ణా జిల్లా నందిగామలోని డీవీఆర్ కాలనీలో నిన్న ఒక వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో స్వీట్లు మిగిలిపోయాయి. వాటిని పది మంది స్థానికులు తిన్నారు. వారంతా వాంతులు చేసుకుని తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు తెలపడంతో వారిని హుటాహుటీన విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ పదిమందిలో ముగ్గురు పిల్లలు, ముగ్గురు మహిళల ఆరోగ్య పరిస్థితి విషమంగా […]
పెళ్లిలో మిగిలిపోయిన స్వీట్స్ పదిమంది పాలిట శాపంగా మారాయి. కృష్ణా జిల్లా నందిగామలోని డీవీఆర్ కాలనీలో నిన్న ఒక వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో స్వీట్లు మిగిలిపోయాయి. వాటిని పది మంది స్థానికులు తిన్నారు. వారంతా వాంతులు చేసుకుని తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు తెలపడంతో వారిని హుటాహుటీన విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ పదిమందిలో ముగ్గురు పిల్లలు, ముగ్గురు మహిళల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Tags : marriage, food poison, krishna district, nandigama dvr colony, sweets