దిశ ‘డబుల్’ ఎఫెక్ట్.. టీఆర్ఎస్ నేతపై పోచారం సీరియస్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రుద్రూర్ మండలంలో అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తున్నారు.. అని ‘దిశ’ దిన పత్రికలో ఈ నెల 10న వచ్చిన కథనంపై శాసన సభాపతి పార్టీ నేతలపై మండిపడ్డారు. అదివారం మండలంలోని ఓ నేతకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి మందలించినట్టు తెలిసింది. మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులకు కేటాయించేందుకు కుల సంఘాలలో అట్టడుగు వర్గాల వారిని ఎంపిక చేసే భాధ్యత అప్పగిస్తే.. 48 […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రుద్రూర్ మండలంలో అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తున్నారు.. అని ‘దిశ’ దిన పత్రికలో ఈ నెల 10న వచ్చిన కథనంపై శాసన సభాపతి పార్టీ నేతలపై మండిపడ్డారు. అదివారం మండలంలోని ఓ నేతకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి మందలించినట్టు తెలిసింది. మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులకు కేటాయించేందుకు కుల సంఘాలలో అట్టడుగు వర్గాల వారిని ఎంపిక చేసే భాధ్యత అప్పగిస్తే.. 48 మందిని మాత్రమే ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
గత ఏడాది అనర్హుల జాబితాపై పోచారం సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ సారైనా అర్హులకు కేటాయించేందుకు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు భాధ్యతలను అప్పగిస్తే మళ్లీ స్థానికేతరులు, అనర్హులతో కూడిన జాబితా తయారుచేయడంతో స్పీకర్ సీరియస్ అయ్యారు. ఇదే విషయాన్ని సదరు అధికార పార్టీ నేత మరో యువ నేత వద్ద గోడు వెల్లబోసుకున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా అధికార పార్టీ నేతలు ఇచ్చిన జాబితాను రెవెన్యూ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. జాబితాను సభాపతి పోచారం అదేశాల మేరకు ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్డీఓ సైతం రుద్రూర్‌లో డబుల్ ఇండ్ల కేటాయింపుపై ఆరా తీసినట్లు తెలిసింది. అయితే, చివరకు డబుల్ ఇండ్లు అర్హులకా.. అనర్హులకా అనేది మండలంలో చర్చనీయాంశం అయింది.