వడ్డీ రేట్లను సవరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వినియోగదారులకు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీని బ్యాంకు కొనసాగిస్తోంది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల వ్యవధి కాలానికి మెచ్యూర్ అయిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 5.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందించనున్నట్టు, సవరించిన వడ్డీ రేట్లు మే 1వ తేదీ నుంచి అమల్లోకి […]

Update: 2021-05-13 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వినియోగదారులకు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీని బ్యాంకు కొనసాగిస్తోంది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల వ్యవధి కాలానికి మెచ్యూర్ అయిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 5.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందించనున్నట్టు, సవరించిన వడ్డీ రేట్లు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసే సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిటర్లపై 0.5 శాతం అదనపు వడ్డీ పొందవచ్చని, వీరికి 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలానికి మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 5.75 శాతం వడ్డీ లభిస్తుందని పేర్కొంది.

Tags:    

Similar News