నితీషే బిహార్ సీఎం : ప్రధాని మోడీ
దిశ, వెబ్‌డెస్క్ : బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఉంటారని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. ఆయన నాయకత్వంలోనే బిహార్ అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.రానున్న రోజుల్లో మహిళల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మోడీ చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో బిహార్‌కు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. ఇదిలాఉండగా, గతంతో పోలిస్తే ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 74స్థానాలను దక్కించుకుని సెకండ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఉంటారని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. ఆయన నాయకత్వంలోనే బిహార్ అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.రానున్న రోజుల్లో మహిళల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మోడీ చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో బిహార్‌కు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు.
ఇదిలాఉండగా, గతంతో పోలిస్తే ఈసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 74స్థానాలను దక్కించుకుని సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, జేడీయూ 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గతంలో కంటే ఈసారి బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా, జేడీయూ మాత్రం సిట్టింగ్ స్థానాలను దారుణంగా కోల్పోయింది. ఏన్డీయే కూటమిలో బీజేపీ ఎక్కువ స్థానాలు దక్కించుకోవడంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చే అవకాశం లేకపోలేదని పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే బిహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీషే కొనసాగుతారని, అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ కుండబద్దలు కొట్టారు.