యాప్ ఆవిష్కర్తలకు ప్రధాని సవాల్
దిశ, వెబ్‌డెస్క్: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల పలు యాప్‌లను భారత్ నిషేధించింది. దీంతో ఈలోటును భర్తీ చేసేలా భారత్‌లో యాప్‌లను రూపొందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈమేరకు ప్రధాని మోదీ శనివారం డిజిటల్ ఇండియన్ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ఆవిష్కరించారు. ‘అంకుర పరిశ్రమల్లో ప్రపంచ స్థాయిలో భారత్ యాప్‌లను రూపొందించాలన్న ఉత్సాహం కనబడుతోంది. వారికి అన్ని విధాలా అండగా ఉండి, వారి ఆలోచనలకు కార్యరూపం దాల్చేందుకు నీతిఆయోగ్, సమాచార సాంకేతిక శాఖలు […]
దిశ, వెబ్‌డెస్క్: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల పలు యాప్‌లను భారత్ నిషేధించింది. దీంతో ఈలోటును భర్తీ చేసేలా భారత్‌లో యాప్‌లను రూపొందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈమేరకు ప్రధాని మోదీ శనివారం డిజిటల్ ఇండియన్ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ఆవిష్కరించారు.
‘అంకుర పరిశ్రమల్లో ప్రపంచ స్థాయిలో భారత్ యాప్‌లను రూపొందించాలన్న ఉత్సాహం కనబడుతోంది. వారికి అన్ని విధాలా అండగా ఉండి, వారి ఆలోచనలకు కార్యరూపం దాల్చేందుకు నీతిఆయోగ్, సమాచార సాంకేతిక శాఖలు సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ఆవిష్కరిస్తున్నాయి.’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా ట్రాక్-1, ట్రాక్-2 పోటీలను నిర్వహించనున్నారు. ఇంటి పని, సోషల్ మీడియా, ఈ-లెర్నింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆరోగ్యం, అగ్రిటెక్ ఆటలు మొదలైన వాటికి సంబంధించి ట్రాక్ -1 పోటీలు ఉంటాయి. ఈ పోటీలు జూలై4 నుంచి మొదలవుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.