తుక్కు పాలసీతో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు..

దిశ, వెబ్‌డెస్క్: వాహనాల తుక్కు పాలసీని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభిస్తూ, ఈ విభాగంలో పెట్టుబడులను పెంచేందుకు స్టార్టప్ సంస్థలు, యువ పారిశ్రామికవేత్తలు భారీ ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఈ పాలసీ ద్వారా కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను తొలగించి, పర్యావరణ హితంగా మార్చేందుకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఈ విభాగంలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. […]

Update: 2021-08-13 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాహనాల తుక్కు పాలసీని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపింగ్ పాలసీని ప్రారంభిస్తూ, ఈ విభాగంలో పెట్టుబడులను పెంచేందుకు స్టార్టప్ సంస్థలు, యువ పారిశ్రామికవేత్తలు భారీ ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఈ పాలసీ ద్వారా కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను తొలగించి, పర్యావరణ హితంగా మార్చేందుకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఈ విభాగంలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. కొత్త స్టార్టప్‌లు ఈ విభాగంలో ప్రవేశించడం ద్వారా దేశంలోని మధ్య తరగతి వర్గాలకు ఈ పాలసీ ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.

కాలుష్యాన్ని తగ్గించి, ఎక్కువ కాలంపాటు వినియోగంలో ఉన్న వాహనాలను తుక్కుగా మార్చే ఈ రంగంలో గణనీయమైన అవకాశాలు ఉన్నాయి. ఇక నుంచి వాడకుండా నిరుపయోగంగా ఉన్న వాహనాలు దశలవారీగా తగ్గిపోనున్నాయి. దీనికోసం కొత్త స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేయడంలో ముందుకురావాలని యువతకు మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తుక్కు పాలసీ వల్ల ముడి పరికరాల ధరలు 40 శాతం క్షీణించాయన్నారు. కాగా, ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాహన తుక్కు పాలసీని ప్రతిపాదిస్తూ.. దేశీయంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఉపాధికి అవకాశం ఉంటుందన్నారు.

Tags:    

Similar News